Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైగర్ నాగేశ్వరరావులో రవితేజ స‌ర‌స‌న నూపుర్ సనన్ ఎంపిక‌

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (17:24 IST)
Nupur Sanon
మాస్ మహారాజా రవితేజ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు  టైటిల్ పోస్టర్‌తో ఆసక్తిని సృష్టించింది. విమర్శకుల ప్రశంసలు పొందిన మరియు కమర్షియల్ బ్లాక్‌బస్టర్ చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్‌ను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్ర‌మిది.  ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించబడుతుంది. ఇది నిర్మాతకు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్., తేజ్ నారాయణ్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
ఈ సినిమాలో రవితేజ సరసన నటించే నటిని ఖరారు చేశారు మేకర్స్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ నటి నూపూర్ సనన్ ను ఎంపిక‌చేశారు.. మంచి విద్యావంతుల కుటుంబం నుంచి వ‌చ్చిన‌  ఆమె త‌న సోదరి కృతి సనన్ నే ఓ రోల్ మోడ‌ల్‌గా తీసుకుంది. అయినా ఆమె చిత్ర‌రంగంలోకి ప్ర‌వేశించ‌డానికి ముందు అనేక అడ్డంకులు ఎదుర్కొంది. ఈమె ఇప్పుడు తెలుగులో టైగర్ నాగేశ్వరరావుతో అరంగేట్రం చేస్తోంది. గతంలో అక్షయ్ కుమార్‌తో కలిసి మ్యూజిక్ వీడియోలో కనిపించిన నూపూర్‌కి ర‌వితేజతో చేస్తున్న‌ మొదటి చిత్రం కావ‌డం విశేషం.
 
మాదాపూర్‌లోని నోవాటెల్‌లో (హెచ్‌ఐసిసి)లో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని ఉగాది రోజున (ఏప్రిల్ 2వ తేదీ) ప్రారంభించనున్నారు. అదే రోజు సినిమా ప్రీ లుక్‌ని కూడా విడుదల చేయనున్నారు.
 
పవర్ ఫుల్ స్క్రిప్ట్ అందించిన వంశీ,  ఈ సినిమాలో రవితేజను  పూర్తిగా మాస్ లుక్‌లో చూపించ‌బోతున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది.
 
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండ‌గా, ఆర్ మదీ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీని నిర్వ‌హిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments