సీనియ‌ర్ ఎన్టీఆర్ తో చ‌ర‌ణ్ - ఫోటోను పోస్ట్ చేసిన ఎన్టీఆర్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వీరిద్ద‌రు క‌లిసి భారీ మ‌ల్టీస్టార‌ర్లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంట

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (13:24 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వీరిద్ద‌రు క‌లిసి భారీ మ‌ల్టీస్టార‌ర్లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా కార‌ణంగా చెర్రీ, తార‌క్‌ల మ‌ధ్య స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. ఒక‌రింటికి ఒక‌రు వెళ్ల‌డం... క‌లిసి పార్టీలు చేసుకోవ‌డం.. చూస్తుంటే.. హీర‌లంద‌రూ ఇలా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఎన్టీఆర్‌ గత రాత్రి తన ట్విట్టర్‌లో ఆసక్తికర ఫోటో ఒక దానిని ట్వీట్‌ చేశాడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో కింద రామ్‌ చరణ్‌ కూర్చుని ఉన్న స్టిల్‌ అది. ఎన్టీఆర్‌ ఫోటో వైపు చూస్తూ ఫోజు ఇచ్చిన చెర్రీ ఫోటోను పోస్ట్‌ చేసిన తారక్‌ ‘మహానుభావుల ఆలోచనల నుంచి ప్రేరణ’ అంటూ ఓ కాప్షన్‌ ఉంచాడు. 
 
ఈ ఫోటో గురించి అటు చెర్రీ ఫ్యాన్స్, ఇటు తార‌క్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండ‌టంతో ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ప్ర‌స్తుతం చెర్రీ, తార‌క్ ఇద్ద‌రు త‌మత‌మ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు పూర్తి చేసుకున్న త‌ర్వాత అంటే అక్టోబ‌ర్‌లో ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments