ఎన్టీఆర్ అరవింద సమేత.. లుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్

ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు రాయలసీమ నేపథ్యంలో చిత్రించ‌నున్నార‌ని టాక్ వస్తోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందించగా, హారిక

Webdunia
ఆదివారం, 20 మే 2018 (13:05 IST)
ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు రాయలసీమ నేపథ్యంలో చిత్రించ‌నున్నార‌ని టాక్ వస్తోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందించగా, హారిక అండ్‌​ హాసిని క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. 
 
తాజాగా ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో సీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్‌ వేశారట. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సెట్స్‌పై ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన అరవింద సమేత అనే టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఎన్టీఆర్‌ పుట్టినరోజు కానుకగా రిలీజ్‌ చేసిన సినిమా టైటిల్‌, ఎన్టీఆర్‌ ఫస్ట్‌‌లుక్‌ అదిరిపోయింది. సిక్స్‌ ప్యాక్‌తో ఎన్టీఆర్‌, కత్తి పట్టుకుని ఉన్న ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. అరవింద సమేత టైటిల్‌ కాగా, వీర రాఘవ అనేది ఉపశీర్షిక. టైటిల్ కూడా విభిన్నంగా ఉందంటూ సోషల్‌మీడియా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ లుక్‌కు లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. 
 
ఈ లుక్‌పై వివాదాస్పద దర్శకుడు వర్మ స్పందిస్తూ.. వావ్‌... తారక్‌ సెక్సీలుక్‌లో ఎన్నడూ లేనంత సెక్సీగా ఉన్నారు. ఎన్టీఆర్‌ సెక్సీ కంటే ఎక్కువ సెక్సీగా ఉన్నారంటూ ట్వీట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి చోరీ కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర : భూమన

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

నాతో పెట్టుకోవద్దు... మీ పునాదులు కదిలిస్తా : బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్న వేములవాడ ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం