Webdunia - Bharat's app for daily news and videos

Install App

కథానాయకుడు.. మహానాయకుడిగా ఎన్టీఆర్

ఎన్టీఆర్‌‍గా బాలకృష్ణ ప్రధానపాత్రను పోషిస్తూ.. క్రిష్ దర్శకత్వంలో ''ఎన్టీఆర్'' బయోపిక్ రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (18:42 IST)
ఎన్టీఆర్‌‍గా బాలకృష్ణ ప్రధానపాత్రను పోషిస్తూ.. క్రిష్ దర్శకత్వంలో ''ఎన్టీఆర్'' బయోపిక్ రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే హీరోగా, రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్ సుదీర్ఘమైన ప్రస్థానాన్ని కొనసాగించారు. అందుచేత ఆయన బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. 
 
ఎన్టీఆర్ జీవితాన్ని రెండున్నర గంటల్లో ఆయన జీవిత చరిత్రను చెప్పడం కష్టమని క్రిష్ భావించినట్టుగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ సినిమా జీవిత వైభవాన్ని ఒక భాగంగా.. రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన జర్నీ రెండో భాగంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో 'ఎన్టీఆర్' బయోపిక్ మొదటి భాగానికి 'ఎన్టీఆర్ కథానాయకుడు' అనే టైటిల్‌ను ఖరారు చేసి గురువారం సోషల్ మీడియాలో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.


ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన విషయాలతో కూడినదిగా వుండే రెండవ భాగానికి ఎన్టీఆర్ మహానాయకుడు అనే టైటిల్‌ను, ఎన్టీఆర్ పేరుతో తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం వుంటుందని తెలుస్తోంది. రెండో భాగాన్ని జనవరి 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రానా తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయడం విశేషం.   

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments