Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ అండ్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్..!

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (21:45 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. నందమూరి హీరో ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రూపొందుతోన్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
 
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
 
లాక్ డౌన్ లేకపోతే ఈపాటికే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కానీ... కరోనా కారణంగా స్టార్ట్ కాలేదు. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... కేజీఎఫ్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ మూవీ చేయనున్నారు అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
 
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ భారీ చిత్రానికి మిస్సైల్ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని తెలిసింది. 
 
కథకు కరెక్ట్‌గా ఈ టైటిల్ సరిపోతుందని.. అందుకని ఈ టైటిల్‌నే ఫిక్స్ చేయనున్నట్టు సమాచారం. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి.. ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments