Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్య - జూనీయర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్..!

Advertiesment
బాలయ్య - జూనీయర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్..!
, శుక్రవారం, 12 జూన్ 2020 (18:48 IST)
నందమూరి అభిమానుల కోరిక బాలయ్య - జూనీయర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తే చూడాలని. ఇది జరిగితే చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే.. జూనీయర్ ఎన్టీఆర్‌కు, బాలయ్యకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తుందని.. అందుచేత ఇది జరిగే పని కాదని అభిమానులే కాకుండా చాలామంది అనుకుంటున్నారు. బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా పలు న్యూస్ ఛానల్స్‌కు ఇంటర్‌వ్యూ ఇచ్చారు.
 
ఓ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఇంతకీ విషయం ఏంటంటే... జూనీయర్ ఎన్టీఆర్ మీరు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు..? మీరు జూనీయర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తారా అని అడిగితే.. తప్పకుండా నటిస్తాను. జూనీయర్ ఎన్టీఆర్‌తో ఎందుకు కలిసి నటించను. మంచి కథ కుదరాలి. కథ సెట్ అయితే... తప్పకుండా మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది అన్నారు.
 
బాబాయ్ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూనీయర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో స్పందిస్తూ... నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే.. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య అంటూ స్పందించారు.
 
జూనీయర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అనడం... బాలయ్య గురించి జూనీయర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో స్పందించడం.. ఇదంతా చూస్తుంటే.. వీరిద్దరి మధ్య ప్రస్తుతం ఎలాంటి కోల్డ్ వార్ లేదని తెలుస్తుంది. సో... ఈ బాబాయ్ - అబ్బాయ్ కలయికలో సెన్సేషనల్ మల్టీస్టారర్ తెర పైకి వచ్చే రోజు ఇంకెంతో దూరంలో లేదన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లో రాణించాలంటే.. పదవులు కావాలంటే.. అది వుండాలి? (video)