Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతికి ఆ ఆత్మహత్యకు లింకులేదు : రతన్ సైనీ

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించి.. బాలీవుడ్ అగ్రతారలు దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన పద్మావతి సినిమాను వివాదాలు వీడట్లేదు. ఒకవైపు కర్ణిసేన రాజ్‌పుత్‌లు పద్మావత

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (16:31 IST)
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించి.. బాలీవుడ్ అగ్రతారలు దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన పద్మావతి సినిమాను వివాదాలు వీడట్లేదు. ఒకవైపు కర్ణిసేన రాజ్‌పుత్‌లు పద్మావతికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన నేపథ్యంలో.. పద్మావతి సినిమాకి వ్యతిరేకంగా జైపూర్ సమీపంలోని నహార్‌గఢ్ కోటపై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యను కూడా పద్మావతికి లింకు పెట్టి మీడియాలో వార్తలు వచ్చేశాయి. 
 
కోట పైభాగం నుంచి వెలుపలి వైపు అతడి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించండంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అయితే యువకుడు పద్మావతి కోసం ఆత్మహత్య చేసుకున్నాడా? లేకుంటే ఎవరైనా యువకుడి శవాన్ని రాజస్థాన్ కోటకు కట్టి.. పద్మావతి కోసం ఆత్మహత్య అంటూ చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. 
 
ఇందులో భాగంగా.. జైపూర్‌లోని న‌హ‌ర్‌గ‌ర్ కోట‌గోడ‌కు ఉరివేసుకుని చ‌నిపోయిన చేత‌న్ కుమార్ సైనీ ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాద‌ని, ఎవ‌రో హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా సృష్టించార‌ని చేత‌న్ కుమార్ సోద‌రుడు రామ్ ర‌త‌న్ సైనీ స్పష్టం చేశాడు. అంతేగాకుండా పద్మావతి సినిమాకు తన సోదరుడి మరణానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. 
 
తన సోదరుడి మృతి పట్ల విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. మరోవైపు చేతన్ కుమార్ ఆత్మహత్యకు కర్ణిసేన బాధ్యత వహించలేదు. అతని ఆత్మహత్యకు కర్ణిసేనకు లింకులేదని ఇప్పటికే కర్ణిసేన స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments