రాజమౌళితో విభేదాల్లేవు, ఫ్రెష్ నెస్ కోసమే జూనియర్‌ చేశా : కె.కె. సెంథిల్ కుమార్

దేవీ
శనివారం, 12 జులై 2025 (16:54 IST)
K.K. Senthil Kumar
ఇండస్ట్రీ లోకి వచ్చి 25 ఏళ్ల అవుతుంది. ఈ 25 ఏళ్ళు మంచి సినిమాలు చేస్తున్నాం, చక్కగా పనిచేస్తున్నామనే పేరు తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాహుబలి, ఆర్ఆఆర్ లాంటి సినిమాలు చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కొత్తగా  స్వయంభు చేస్తున్నాను. అది బహుబలి లాంటి జోనరు. రాజులనాటి కథ. అలాగే ఇండియన్ హౌస్ సినిమా చేస్తున్నాను అని సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ అన్నారు.
 
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన సినిమా 'జూనియర్‌'. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.  రాధా కృష్ణ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ పని చేశారు. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ సినిమా విశేషాలని పంచుకున్నారు.  
 
- నిర్మాత సాయి గారితో నాకు మంచి పరిచయం ఉంది. ఆయనతో 'ఈగ' సినిమా చేశాను. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా గురించి చెప్పారు.  డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. మంచి ప్రొడక్షన్ హౌస్, టెక్నికల్ టీం కూడా చాలా బాగుంది. అలా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది.
 
- కొత్తవారిని పరిచయం చేసినప్పుడు ఫ్యామిలీ డ్రామా జానర్ కి వెళ్ళరు. డాన్స్లు ఫైట్లు ఉంటే చాలు అనుకుంటారు. కానీ ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. అది నాకు చాలా ఇంప్రెస్ చేసింది. కొత్త హీరో ఇలాంటి ఛాలెంజ్ తీసుకొని చేయడం అనేది నాకు చాలా నచ్చింది
 
- నేను రాజమౌళి గారితో పెద్ద కాన్వాస్ సినిమాలు చేశా ఈ సినిమాని ఎంచుకోవడానికి కారణం వుంది. ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. ఒక హెవీ గ్రాఫిక్స్ సిజీ వర్క్ ఉన్న సినిమా తర్వాత ఇలాంటి సినిమా చేయడం నాకూ రిఫ్రెష్ గా అనిపించి చేశాను. ఇందులో ఉన్న కోర్ ఎమోషన్ నాకు చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాస్ రావడం తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది.
 
- ఒక సినిమాని సెలెక్ట్ చేసుకోవాలంటే స్టోరీ ఎమోషనల్ గా మూవ్ అవుతుందో లేదో చూస్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ మనల్ని కదిలించకపోతే మిగతా ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నా కూడా వర్కౌట్ అవ్వదు.  
 
- ఇప్పుడే కాదండి. గతంలో కూడా రాజమౌళి గారు నేను వరుసగా సినిమాలు చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఉండేది. విక్రమార్కుడు, మర్యాద రామన్న నేను చేయలేదు. దీనికి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మేము కలిసి పని చేస్తాం.
 
-  ఇందులో చాలా డిఫరెంట్ జెనీలియాని చూశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర, పెర్ఫార్మన్స్ సరికొత్తగా ఉంటుంది. ఆడియన్స్ చాలా సర్ప్రైజ్ అవుతారు.
 
- నేను దర్శకత్వం చేయాలనుకున్నా. అదే అయితే అది ఇప్పుడే కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. కొన్ని కథల మీద వర్క్ చేయడం జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments