Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kartikeya: ఏడు ఏళ్లు పూర్తి చేసుకున్న ట్రెండ్ సెట్టర్ ఆర్ ఎక్స్ 100

దేవీ
శనివారం, 12 జులై 2025 (16:40 IST)
RX 100- 7 years poster
కొన్ని కథలు, అవి క్రియేట్ చేసిన రికార్డులు, ఏళ్ళు గడిచినా అలా చెక్కుచెదరకుండా మిగిలిపోతాయి, విడుదలైన మొదటి రోజున వచ్చిన రెస్పాన్స్ చిరకాలం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. అలాంటి సినిమానే దర్శకుడు అజయ్ భూపతి – హీరో కార్తికేయ మొదటి చిత్రం "ఆర్ ఎక్స్ 100 ". 7 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ రియల్ కల్ట్ బ్లాక్బస్టర్ చిత్రానికి ఇప్పటికీ ప్రేక్షకుల మనసులలో విభిన్న స్థానం ఉంది.
 
చిన్న సినిమాగా కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో, ఓ చిన్న టౌన్ నేప‌థ్యంలో నడిచిన ఈ రియ‌లిస్టిక్ ల‌వ్ స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో 26 సెంటర్లలో 50 రోజులు ప్రదర్శితమైంది. 2 కోట్లతో నిర్మించిన చిత్రానికి బాక్సాఫీస్ వద్ద 25కోట్లకు పైగా వసూళ్ళు రాగా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
 
సినిమా విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ తో విపరీతమైన బజ్ క్రియేట్ చేసుకుని, దర్శకుడు అజయ్ భూపతి – హీరో కార్తికేయ హై వోల్టేజ్ కంటెంట్, పెర్ఫార్మెన్స్ తో సినిమా విడుదలైన మొదటి రోజు నుండే యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ఒక్క తెలుగు భాషలోనే కాకుండా హిందీ, ఒడియా, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా తమిళ్ మరియు ఇతర భాషల్లో కూడా రీమేక్ చేసే చర్చలు జరిగాయి. ఈ చిత్ర కథ, కథనాల ప్రేరణతో తెలుగుతో పాటు ఇతర భాషల్లో చాలా చిత్రాలు తెరకెక్కాయి. 
 
దర్శకుడు అజయ్ భూపతి, హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల రాజ్ పుత్, చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నీషియన్ల కి ఆ తరువాత అద్భుతమైన అవార్డులు, అవకాశాలు రాగా, వారి కెరీర్లో మొదటి మేటి చిత్రంగా "ఆర్ ఎక్స్ 100" ఎప్పటికీ నిలిచిపోతుంది.
 
ఈ చిత్రానికి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ వల్ల రీ–రిలీజ్ కి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే, అది త్వరలో జరగాలని ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments