Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ

Advertiesment
Santosh Shobhan's  couple-friendly

దేవీ

, శనివారం, 12 జులై 2025 (16:33 IST)
Santosh Shobhan's couple-friendly
సంతోష్ శోభన్ హీరోగా మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో  నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా తెరకెక్కుతోంది.
 
ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తే చెన్నైలో లైఫ్ లీడ్ చేస్తున్న మిడిల్ క్లాస్ తెలుగు అబ్బాయిగా సంతోష్ శోభన్ కనిపిస్తున్నారు. చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్ ఇవ్వనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా త్వరలోనే తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రైమ్‌ థ్రిల్లర్‌ ఆ గ్యాంగ్‌ రేపు-3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతోంది