Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతి అయోగ్ జాబితాలో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (16:15 IST)
bala krishna- ramakrishna
న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌమ‌ నంద‌మూరి తార‌క‌రామారావు స‌తీమ‌ణి పేరిట హైద‌రాబాద్ లో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని ఏర్పాటు చేసి క్యాన్స‌ర్ రోగుల‌కు వైద్య సేవ‌లందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎటువంటి లాభాపేక్ష లేని చికిత్సాల‌యంగా బ‌స‌వ‌తార‌కం గుర్తింపు తెచ్చుకుంది.
 
ఈ సంద‌ర్భంగా లాభాపేక్ష లేని ఆస్ప‌త్రిగా నీతి అయోగ్ త‌న జాబితాలో చేర్చింది. ఈ నివేదిక‌లో పుట్ట‌ప‌ర్తి వైద్యాల‌యం స‌హా బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి పేర్లు చేరాయి. 500ప‌డ‌క‌ల బ‌స‌వ‌తార‌కం సొంతంగానే నిధుల్ని స‌మ‌కూర్చుకుంటోంది. మూల‌ధ‌న వ్య‌యం కోసం గ్రాంట్ ల‌పై ఆధార‌ప‌డుతోంది. అయితే ఈ స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల్సిందిగా నీతి అయోగ్ సూచించింది. పుట్ట‌ప‌ర్తి ట్ర‌స్ట్ ఆస్ప‌త్రులు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి విరాళాలు అందించే ధాత‌ల‌కు ప‌న్ను మిన‌హాయింపు 50శాతానికి ప‌రిమితం చేయ‌కుండా 100 శాతం ఇవ్వాల‌ని నీతి అయోగ్ పేర్కొంది. ఇలాంటి లాభాపేక్ష లేని ఆస్ప‌త్రుల‌కు ప్ర‌భుత్వాల‌ రీఇంబ‌ర్స్ మెంట్ వెంట‌నే ఇవ్వాల‌ని కూడా నీతి అయోగ్ ప్ర‌స్థావించింది. పేద బ‌డుగులకు నాణ్య‌మైన సేవ‌లందిస్తున్న ఆస్ప‌త్రులుగా స‌ద‌రు ఆస్ప‌త్రుల‌కు నీతి అయోగ్ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. 
 
ఈ సంద‌ర్భంగా నంద‌మూరి రామ‌కృష్ణ - బాల‌కృష్ణ సోద‌రులు `నీతి అయోగ్ జాబితాలో తాజా గుర్తింపు`న‌కు ఆనందం వ్య‌క్తం చేశారు. నంద‌మూరి సోద‌రులు మాట్లాడుతూ-``బసవతార‌కం ఇండో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ నీతి అయోగ్ జాబితాలో చేర‌డం ప్ర‌తిష్ఠాత్మ‌క గుర్తింపు.. ఆదర్శప్రాయమైన సేవ .. దేశ ప్ర‌జ‌ల‌ ఆరోగ్య సంరక్షణకు ఆస్ప‌త్రి చేసిన కృషికి ద‌క్కిన ప్ర‌తిఫ‌ల‌మిది. దేశానికి ఆస్ప‌త్రి వ‌ర్గాలు చేసిన త్యాగం ఎంతో గొప్ప‌ది. మొత్తం ఆస్ప‌త్రి టీమ్ కు వందనాలు.. జ‌య‌హో`` అని అన్నారు. బ‌సవతారకం కుటుంబంలోని ప్రతి సభ్యునికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా శ్రేయోభిలాషులకు  కృతజ్ఞతలు అని తెలిపారు. ప్ర‌యివేటు ఆస్పత్రుల‌తో పోలిస్తే బ‌స‌వ‌తారకం త‌క్కువ ఫీజు వ‌సూలు చేస్తోంది. 2000లో బ‌స‌వ‌తార‌కం ప్రారంభం ఈ 15 ఏళ్ల‌లో 1,65,000 మంది క్యాన్స‌ర్ రోగుల‌ను ప‌రీక్షించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments