Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతికి గాయమైనా మళ్లీ స్వయంభూ లో జాయిన్ అయిన నభా నటేష్

డీవీ
గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:00 IST)
Nabha Natesh
'కార్తికేయ 2' ఫేమ్ నిఖిల్ నటిస్తున్న 'స్వయంభూ' ప్రస్తుతం దేశంలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. లెజెండరీ యోధుడిగా నటిస్తున్న నిఖిల్ పాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న 'స్వయంభూ' నిఖిల్ 20వ చిత్రం. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ , శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. స్వయంభూ టాప్-క్లాస్ టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోంది.
 
ఈ చిత్రంలో సంయుక్త ఒక కథానాయికగా నటిస్తోంది. ఆమె తన పాత్ర కోసం శిక్షణ కూడా తీసుకుంది. మేకర్స్ ఈరోజు ఒక పెద్ద అప్‌డేట్‌తో వచ్చారు. చేతికి గాయమైన నభా నటేష్ మళ్లీ వర్క్ లో చేరారు. ఈ మాస్టర్‌పీస్‌లో ఒక మహిళా ప్రధాన పాత్రను పోషించడానికి ఆమె బోర్డులోకి వచ్చారు. మేకర్స్ ఆమె లుక్ ని రివిల్ చేశారు. నభా గాయం నుంచి కోలుకుని టీంలో చేరినట్లు వీడియోలో ప్రజెంట్ చేశారు. ఈ పాత్ర కోసం ఆమె ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా వుంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో, చీరలో నగలతో ఆమె యువరాణిలా కనిపిస్తోంది. నిఖిల్ కూడా వీడియోలో ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
 
ఈ చిత్రంలో నభా నటేష్ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తోంది. అది పోస్టర్‌లో ఆమె గెటప్, లుక్‌లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్.
 
ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా, M ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి  డైలాగ్స్ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సాగు చట్టాలపై తన వ్యాఖ్యలు వ్యక్తిగతం - బీజేపీకి సంబంధం లేదు : కంగనా రనౌత్

కేరళలో వెలుగు చూసిన మరో మంకీ పాక్స్ కేసు... భారత్‌లో మూడు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్

విజయవాడ వరద నీటిలో తిరిగిన బాలుడు, కాటేసిన ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్, కాలు తీసేసారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments