టీడీపీలోకి నిఖిల్ సిద్ధార్థ్.. స్వాగతం పలికిన నారా లోకేశ్

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

టీడీపీలోకి నిఖిల్ సిద్ధార్థ్.. స్వాగతం పలికిన నారా లోకేశ్

Advertiesment
Nikhil_Nara lokesh

సెల్వి

, శనివారం, 30 మార్చి 2024 (10:07 IST)
Nikhil_Nara lokesh
టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ శుక్రవారం తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. ఆయనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అధికారికంగా పార్టీలోకి స్వాగతం పలికారు. నిఖిల్‌ను నారా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించి పసుపు శాలువాతో సత్కరించారు. 
 
నిఖిల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు సామాజిక సమస్యలపై పోస్ట్‌లు పెడుతూనే ఉన్నాయి. రాజకీయాలపై అంతకుముందు ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ఎన్నికల తరుణంలో ఆయన టీడీపీలోకి రావడం ఉత్కంఠ రేపుతోంది. 
 
ఆయన పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నా.. టీడీపీ అభ్యర్థుల తుది జాబితాను ఇప్పటికే ప్రకటించడంతో పార్టీలో ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
 
టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న యువ నటుల్లో నిఖిల్ ఒకరు. ఇటీవలే కార్తికేయ 2, 18 పేజీలు, గూఢచారి వంటి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 
 
హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నిఖిల్ ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నారైలకు వార్నింగ్ ఇచ్చిన వైసీపీ అభ్యర్థి అశోక్ బాబు