Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరం సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసిన సినీ సెలెబ్రిటీలు

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2023 (13:59 IST)
యావత్ ప్రపంచం డిసెంబరు 31వ తేదీ అర్థరాత్రి నుంచి కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోనుంది. ఈ వేడుకలను జరుపుకునేందుకు అనేక మంది స్టార్స్ తమ స్థాయికి తగిన పర్యాటక ప్రాంతాలు, నక్షత్ర హోటళ్లు, దేశ విదేశాకు వెళ్లిపోయారు. ఇలాంటి వారిలో తెలుగు హీరోలు కూడా ఉన్నారు. తరచూ విదేశాలకు వెళ్లివచ్చే సూపర్ స్టార్ మహేశ్ బాబు న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్‌కు చేరుకున్నారు. 
 
"గుంటూరు కారం" షూట్ పూర్తవడంతో ఆయన కుటుంబంతో సహా దుబాయ్‌కు వెళ్ళారు. పనిలో పనిగా అక్కడ ఓ యాడ్ షూటింగ్‌కి కూడా ప్లాన్ చేశారట. జపాన్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్లాన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈయన ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళారు. పైగా, తారకు జపాన్ అభిమానులు స్వాగతం పలికిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన భార్యాపిల్లలతో దుబాయ్‌లో ఉన్నారు. అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. నాలుగైదు రోజుల ముందు నుంచే అక్కడ వారి హడావుడి మొదలైనట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. రామ్ చరణ్ ఇంకా ముంబైలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈసారి చరణ్ కొత్త సంవత్సరం వేడుకలు ఇక్కడే జరుపుకుంటారని సమాచారం
 
పరుశురామ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న రౌడీ హీరో విజయ దేవరకొండ ప్రస్తుతం షూటింగ్ కోసం అమెరికాలోనే ఉన్నారు. దీంతో అక్కడే ఇయర్ వేడుకలకు ప్లాన్ చేశాడని తెలిసింది. ఈ ఏడాది కూడా విశాల్ నూతన సంవత్సర వేడుకల కోసం కుటుంబంతో సహా అమెరికా వెళ్లాడు. అక్కడే ఓ ప్రాంక్ వీడియో చేసి నెట్టింట హడావుడి సృష్టించాడు. ఇదిలావుంటే, బాలీవుడ్ స్టార్లు, డైరెక్టర్లు కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు విదేశాలకు వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments