Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరు కారం నుంచి మహేష్ బాబు, శ్రీలీల కుర్చీ మడతపెట్టి మాస్ సాంగ్ విడుదల

Mahesh Babu, sreeleela
, శనివారం, 30 డిశెంబరు 2023 (17:45 IST)
Mahesh Babu, sreeleela
నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మిస్తున్న 'గుంటూరు కారం' కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి క్లాసికల్ చిత్రాలను అందించిన నటుడు-దర్శకుడు కలయికలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
 
చిత్ర బృందం ఇప్పటికే దమ్ మసాలా, హే బేబీ అనే రెండు పాటలను, అలాగే మునుపెన్నడూ లేని విధంగా మహేష్ బాబు యొక్క మాస్ అవతార్ ను పరిచయం చేస్తూ టీజర్ ను విడుదల చేసింది. సంక్రాంతి పండుగకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున రమణ గాడి రుబాబు ఉంటుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.
 
webdunia
kurchi song
ప్రముఖ స్వరకర్త ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి పాటలు సమకూర్చారు. దమ్ మసాలా పాట విడుదల కాగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హే బేబీ పాట కూడా సోషల్ మీడియాలో ఊపందుకుంది. పాటపై అనేక రీల్స్ మరియు షార్ట్‌లు వస్తున్నాయి.
 
ఇప్పుడు చిత్రబృందం మూడో పాటగా హై వోల్టేజ్‌ మాస్‌ నంబర్‌ "కుర్చీ మడతపెట్టి"ని విడుదల చేసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను మరింత మాస్‌గా మరియు ఎనర్జిటిక్‌గా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఈ పాటను విడుదల చేసింది.
 
ఈ పాటలో అదిరిపోయే బీట్‌లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మనం వినే జానపద శైలి సాహిత్యం ఉన్నాయి. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. "రాజమండ్రి రాగ మంజరి... మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి" మరియు "తూనీగ నడుములోన తూటాలెట్టి ... తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి... మగజాతినట్టా మడతపెట్టి.." వంటి పదాలు మరియు పదబంధాలు 80ల నాటి సూపర్‌స్టార్ కృష్ణ గారి యొక్క క్లాసిక్ మాస్ చిత్రాలను గుర్తు చేస్తున్నాయి.
 
లెజెండరీ యాక్టర్ కృష్ణ ఇటువంటి ఎనర్జిటిక్ పాటలు మరియు మాస్ నంబర్లతో మాస్ యొక్క అభిమాన నటుడు అయ్యారు. ఇప్పుడు ఈ పాట ఆయన కుమారుడు మహేష్ బాబు మరియు గుంటూరు కారం చిత్రం బృందం నుంచి ఆ లెజెండ్‌కు నివాళిగా అనిపిస్తుంది.
 
యువ అందాల తార శ్రీలీల ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. మహేష్ బాబుతో కలిసి ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులు చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. ఈ స్టెప్పులకు థియేటర్లు ఖచ్చితంగా షేక్ అవుతాయి.
 
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో కథానాయికగా నటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ సహా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
 
గుంటూరు కారం చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళు అందరం ఒకటే, ఇవ్వాల్సిన అవార్డులు అన్నీ ఇస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి