Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కొత్త కథ రామబాణం : హీరో గోపీచంద్

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (18:21 IST)
Gopichand, Srivas, Vivek Kuchibhotla, Dimple Hayati
'లక్ష్యం', 'లౌక్యం' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. గోపీచంద్ సరసన డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. 
 
మే 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ..  విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల  ఎక్కడా రాజీ పడకుండా సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చి సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. శ్రీవాస్ గారితో 'లక్ష్యం', 'లౌక్యం' చేశాను. మూడో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు 'లక్ష్యం', 'లౌక్యం' లా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాం. అప్పుడు భూపతి రాజా గారి దగ్గర వున్న కథ విన్నప్పుడు చాలా నచ్చింది. మధు, అబ్బూరి రవి గారు కూడా ఈ కథకు చాలా హెల్ప్ చేశారు. డింపుల్ చాలా చక్కగా నటించింది. తనకి మంచి భవిష్యత్ వుంటుంది. మిక్కీ జే మేయర్ తో చేయడం ఇదే మొదటిసారి. చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఇప్పటికే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 5న రామబాణం విడుదలౌతుంది. అందరూ థియేటర్ కి వెళ్లి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది’’ అన్నారు.  
 
దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. గోపీచంద్ నేను సినిమా చేస్తున్నామని తెలిసినప్పటి నుంచి హ్యాట్రిక్ కాంబో అనే పాజిటివ్ వైబ్ అందరి నుంచి వచ్చింది. అది మాకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది. అలాగే 'లక్ష్యం', 'లౌక్యం' కు మించి సినిమా ఉండాలనే కాన్సియస్ ని కూడా ఇచ్చింది.  స్క్రిప్ట్ వర్క్, హార్డ్ వర్క్, టీం వర్క్ అన్నీ కలిపి రామబాణం ఎక్స్ టార్డినరీగా వచ్చింది. ఈ సినిమా అవుట్ పుట్ చూశాక చాలా నమ్మకంగా అనిపిచింది. రామబాణంను ఇంత గ్రాండ్ స్కేల్ లో చేయడానికి పూర్తి సహకారం అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు.  డీవోపీ వెట్రి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. గోపీచంద్ గారి ఫ్యాన్స్ కి కావాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా వుంటాయి. ఆర్ట్ వర్క్ కూడా చాలా అద్భుతంగా కుదిరింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని గ్రాండ్ గా చేశాం. చాలా ఎక్సయిటింగ్ ఎపిసోడ్స్ వున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలెట్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ గొప్పగా కనెక్ట్ అవుతాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఆల్రెడీ విజయం సాధించింది. నేపధ్య సంగీతం కూడా హైలెట్ గా వుంటుంది. ప్రవీణ్ పూడి క్రిస్ప్ గా ఎడిట్ చేశారు. మధు మంచి డైలాగ్స్ రాశారు. భూపతి రాజా గారు  అద్భుతమైన కథ ఇచ్చారు. డింపుల్ పాత్ర చాలా కీలకం. చాలా బ్యూటీఫుల్ గా చేసింది. కుష్బూ గారు, గోపీచంద్ గారి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ కట్టిపడేస్తాయి. అలాగే జగపతి బాబు గారి పాత్ర కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఎంటర్ టైన్ మెంట్, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా కుదిరిన సినిమా రామబాణం. మే 5న ఫ్యామిలీ తో కలసి థియేటర్ లో సరదాగా ఎంజాయ్ చేసి రావచ్చు . ఈ సమ్మర్ కి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రామబాణం అలరిస్తుంది’’ అన్నారు
 
డింపుల్ హయతి మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, గోపీచంద్ గారు, శ్రీవాస్‌ గారి హ్యాట్రిక్ మూవీ రామబాణంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో భైరవి అనే పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్ర మీ అందరినకీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మే 5న అందరూ సినిమా చూడాలి’’ అని కోరారు.
 
వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ..  ఈ వేసవిలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా. గోపీచంద్ గారి యాక్షన్ ని ఇష్టపడే ప్రేక్షకులకు కూడా రామబాణం ఒక పండగలా వుంటుంది. గోపీచంద్ గారికి, శ్రీవాస్ గారికి కృతజ్ఞతలు. మిక్కీ జే మేయర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరికీ కృతజ్ఞతలు. రామబాణం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు.. ఎన్డీయే సమావేశంలో హాజరు.. వాటిపై చర్చ

మియాపూర్‌లో తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన ముజిగల్‌

PV Sindhu: మా ప్రేమ విమానంలో మొదలైంది..తొలి చూపులోనే పడిపోయాం... పీవీ సింధు

Kazakhstan: కజకిస్తాన్‌‌లో కూలిన విమానం.. 72మంది మృతి - పక్షుల గుంపును ఢీకొనడంతో? (video)

Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన- మైనర్ బాలికను బొలెరో కారులో కిడ్నాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments