Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల‌వ్ స్టోరి, క్రైమ్ ఎలిమెంట్ తో అరంగేట్రం రాబోతుంది

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (18:04 IST)
Arangetram team
రోష‌న్. ముస్త‌ఫా అస్క‌రి, శ్రీనివాస్ ప్ర‌భ‌న్‌, అనిరుద్. పూజ, ల‌య‌, ఇందు, సాయి శ్రీ, శ్రీవల్లి, కీర్తన, సత్తిపండు, కోటేష్ మానవ. త‌దిత‌రులు న‌టీన‌టులుగా రూపొందుతోన్న చిత్రం ‘అరంగేట్రం’. మ‌హి మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస్ ప్ర‌భ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్వ‌రి కె. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 5న రిలీజ్ కాబోతున్న సంద‌ర్భంగా దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ మాట్లాడుతూ ‘‘మా ‘అరంగేట్రం’ మూవీ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ. అయితే సైకో బేస్డ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది. మంచి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, మంచి ల‌వ్ స్టోరి ఉంటుంది. వీటిని లింక్ చేసేలా క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. పాట‌లు, ఫైట్స్‌, కామెడీ అన్నీ ఉంటాయి. 
 
ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల మ‌ధ్య ప్ర‌ధానంగా సాగే సినిమా. ఇందులో అనుకోకుండా నేను న‌టించాల్సి వ‌చ్చింది. ఒక్కొక్క క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంది. న‌టీన‌టులు అంద‌రూ చాలా చ‌క్క‌గా న‌టించారు. వారు అందించిన స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాం. చిన్న సినిమానే అయిన‌ప్ప‌టికీ మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. నిజానికి సినిమా రిలీజ్ చేసేంత ఫైనాన్షియల్ స్టామినా మాకు లేక‌పోయిన‌ప్ప‌టికీ మీడియా, ఆడియెన్స్ మంచి సినిమాల‌ను ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కంతో థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాం. మా సినిమాను ఆద‌రించండి. మా నిర్మాత మహేశ్వరిగారు, సహ నిర్మాత విజయలక్ష్మిగారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ మ‌హేష్‌గారికి థాంక్స్‌. మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గిడియాన్ క‌ట్టాగారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. రోష‌న్‌, ముస్త‌ఫా, అనిరుద్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. మే 5న మా సినిమాను చూసే ఆడియెన్స్ మంచి ఫీల్‌తో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఆశిస్తున్నాం’’ అన్నారు.
 
నిర్మాత మ‌హేశ్వ‌రి.కె మాట్లాడుతూ ‘‘మా ‘అరంగేట్రం’ సినిమా చాలా బాగా వచ్చింది. మే 5న థియేటర్స్‌లో మీ ముందుకు వ‌స్తున్నాం. ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.
 
స‌హ నిర్మాత విజ‌య ల‌క్ష్మి మాట్లాడుతూ ‘‘మంచి కాన్సెప్ట్ సినిమాను ఆదిరిస్తారనే నమ్మకంతో మే 5న ‘అరంగేట్రం’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ గిడియన్ కట్టా మాట్లాడుతూ ‘‘నేను గతంలో మంత్ర సినిమాకు కంపోజర్‌గా వ‌ర్క్ చేశాను. చాలా కాలం ఇండ‌స్ట్రీలో జ‌ర్నీ ఉంది. బిగినింగ్‌ను ‘అరంగేట్రం’ అని అంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఇది నాకొక రీ ఎంట్రీ అనాలి. నా లైఫ్‌కు మంచి స‌క్సెస్‌ను ఇస్తుంద‌ని భావిస్తున్నాను. ప్ర‌తి సీన్ ఆడియెన్స్‌ను క‌ట్టిప‌డేసేలా ఉంటుంది. నాతో పాటు ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాం. థియేట‌ర్స్‌కు వ‌చ్చే ఆడియెన్స్‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.
 
ముస్తఫా మాట్లాడుతూ ‘‘‘అరంగేట్రం’ సినిమాలో మంచి పాత్ర చేశాను. నా చిన్న‌ప్ప‌టి రోల్‌లో రోష‌న్ న‌టించాడు. అంద‌రూ అద్భుతంగా న‌టించారు. డైరెక్ట‌ర్ శ్రీనివాస్ ప్ర‌భ‌న్‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ గిడియాన్ క‌ట్టాగారికి థాంక్స్‌’’ అన్నారు.
 
అనిరుద్ మాట్లాడుతూ ‘‘ఈ ‘అరంగేట్రం’ సినిమాతోనే న‌టుడిగా అరంగేట్రం చేస్తున్నాను. గోపిగారు, స‌లీమ్‌గారికి థాంక్స్‌. ఇక మా డైరెక్ట‌ర్ శ్రీనివాస్‌గారు ఎంక‌రేజ్ చేస్తూ మంచి ఔట్‌పుట్ రాబ‌ట్టుకున్నారు. మా నిర్మాత‌గారికి థాంక్స్‌. మా డైరెక్ట‌ర్‌గారు ఎంతో ప్యాష‌న్‌తో చేసిన సినిమా. మే 5న రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
 
రోషన్ మాట్లాడుతూ ‘‘విరూపాక్ష సినిమాలోలాగానే ‘అరంగేట్రం’లోనూ డిఫ‌రెంట్ రోల్ చేశాను. మంచి రోల్ ఇచ్చిన మా డైరెక్ట‌ర్ శ్రీనివాస్‌గారికి, మా నిర్మాత‌ల‌కు థాంక్స్‌. మా టీమ్‌కు థాంక్స్‌. మే 5న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
 
ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు, టెక్నీషియన్స్ సినిమాను ఆదరించాలని కోరుకుంటూ దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments