Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరులో నయన్ - విఘ్నేష్ నిశ్చితార్థం

Webdunia
ఆదివారం, 5 మే 2019 (13:16 IST)
కోలీవుడ్ ప్రేమజంట నయనతార - విఘ్నేష్‌లు ఎట్టకేలకు ఓ ఇంటివారు కాబోతున్నారు. వీరిద్దరూ గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ వచ్చే నవంబరు నెలలో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
ఇప్పటికే నయన, విఘ్నేశ్‌లు రహస్యంగా ఉంగరాలు మార్చుకున్నారనే ప్రచారం తమిళ సినీ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పడు ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరు నిశ్చితార్థం చేసుకోనున్నారట. 2015లో 'నానుమ్‌ రౌడీదాన్' అనే సినిమా ద్వారా నయన్‌, విఘ్నేశ్‌కు మధ్య పరిచయం జరిగింది. ఈ సినిమాకు విఘ్నేశ్‌ దర్శకత్వం వహించగా, హీరోయిన్‌గా నయనతార నటించింది.
 
అపుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి గాఢ ప్రేమికులుగా మారిపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి విహారయాత్రలకు, ఫంక్షన్లకు వెళుతూ కెమెరాల కంటికి చిక్కుతున్నారు. పలు విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలను వీరు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ నవంబరు నెలలో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత ఓ ఇంటివారు కావాలని నిర్ణయించుకున్నారు. 
 
ఇకపోతే, అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ నయనతార బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తమిళంలో శివకార్తికేయన్ నటించిన 'మిస్టర్ లోకల్' చిత్రంలో నయనతార నటించగా ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అలాగే, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' చిత్రంతో పాటు.. రజినీకాంత్ 'దర్బార్' చిత్రంలోనూ నటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments