Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైరా'కు సై అన్న నయనతార... తమిళనాట గ్రాండ్ రిలీజ్

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (17:56 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం వచ్చే నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో నయనతార హీరోయిన్‌ కాగా, అమితాబ్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి అగ్ర తారాగణం నటిస్తోంది. అయితే, ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు దర్శక నిర్మాత భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరుగనుంది. 
 
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. అయితే, గత కొన్ని రోజులుగా ప్రీరిలీజ్ వేడుకలకు నయనతార డుమ్మాకొడుతూ వస్తోంది. ఈ మేరకు ముందుగానే ఆమె అగ్రిమెంట్ చేసుకుంటుందన్న ప్రచారం ఉంది. అందుకే నయనతార 'సైరా' సినిమా ఫంక్షన్‌కి వస్తుందా? అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. అయితే, 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావడానికి ఆమె అంగీకరించిందనేది తాజా సమాచారం. చెన్నైలో తమిళ వెర్షన్‌కి సంబంధించి జరుపనున్న ప్రమోషన్ ఈవెంట్‌కి కూడా ఆమె వస్తుందని చెబుతున్నారు. నయనతార అభిమానులకు ఇది శుభవార్తే. 
 
మరోవైపు, ఈ చిత్రాన్ని తమిళంలో కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. దేశభక్తికి సంబంధించిన ఈ చారిత్రక చిత్రాన్ని, గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తమిళంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు విడుదల చేస్తున్నారు. 'సైరా'లో విజయ్ సేతుపతి కీలకమైన పాత్రను పోషించడంతో అక్కడ కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ వుంది. దీంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments