Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

దేవీ
మంగళవారం, 18 నవంబరు 2025 (16:13 IST)
NBK 111 -Nayanatara look
నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో హిస్టారికల్ ఎపిక్ #NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రస్తుతం పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' సినిమా చేస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
 
మెజెస్టిక్ & మైటీ క్వీన్స్ చాప్టర్ ప్రారంభమైయింది. ఈ హై బడ్జెట్ సినిమాటిక్ స్పెక్టికల్ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నయనతార ఈ ప్రాజెక్ట్‌లో చేరారు. ఆమె పాత్ర కథనానికి కీలకం కానుంది. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ, నయనతార కలిసి నటిస్తున్న నాల్గవ చిత్రం ఇది. ఈ విజయవంతమైన జంటను మరోసారి తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతమైన ట్రీట్ లాంటిది. ఈరోజు నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ ఎనౌన్స్ మెంట్ చేశారు.
 
మేజెస్టిక్ అనౌన్స్‌మెంట్ వీడియోతో సినిమా అంబిషస్ స్కేలు, విజువల్ స్పెక్టకిల్‌ అన్నీ అద్భుతంగా చూపించారు. సినిమాకి కావాల్సిన గ్రాండ్ టోన్‌ను ఇది సెట్ చేస్తుంది.
 
డైరెక్టర్ గోపిచంద్ మలినేని నయనతారను గుర్రంపై పరిచయం చేసే విధానం ద్వారా ఈ ప్రాజెక్ట్‌ ఎంత భారీ స్థాయిలో రూపొందుతోందో స్పష్టమవుతోంది. ఇప్పటివరకు చూడని గ్రాండియర్‌తో విజువల్ వండర్ లా ఈ సినిమా ఉండబోతోంది.
 
గోపిచంద్ మలినేని తొలిసారిగా హిస్టారికల్ డ్రామాలోకి అడుగుపెడుతున్నారు. కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ రూపొందించే తన ప్రత్యేక మాస్ టచ్‌ను ఒక భారీ చారిత్రక కథలో మిళితం చేస్తూ, నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్  చూపించబోతున్నారు. ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ యాక్షన్, అద్భుతమైన విజువల్స్  కలిసి ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
 ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments