Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

దేవీ
బుధవారం, 18 జూన్ 2025 (10:46 IST)
chiranjeevi, Sushmita Konidela
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ #Mega157 చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది.
 
చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తున్న నయనతార ఈరోజు ముస్సోరీలో షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కథా పరంగా, తన పాత్రపై ఎంతో ఆనందంగా వున్న నయనతార, సినిమా ప్రమోషన్‌ల్లో చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నారు. ఇటీవలే ఆమె ఒక ప్రత్యేక ప్రమోషనల్ వీడియో చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాబోయే ప్రచార కార్యక్రమాల్లో నయనతార అదరగొట్టబోతున్నారు.
 
కమర్షియల్ ఫార్మాట్లలో హిలేరియస్ ఎంటర్ టైనర్స్ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్ అయిన అనిల్ రావిపూడి ప్రమోషనల్ కంటెంట్‌ను రూపొందించడంలో స్పెషలిస్ట్. ఇప్పటివరకు ప్రతి ప్రమోషనల్ వీడియో మంచి ముద్ర వేసింది. ఇటివలే రిలీజ్ చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్ అవతార్‌లో కనిపించారు.
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ,  జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
 
#Mega157 మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
 
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
అడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

రొట్టెల పండుగలో- లక్షమందికి పైగా భక్తులు హాజరు.. కోరికలు నెరవేరాలని కొందరు..

దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

పండించడానికి ఒక సంవత్సరం పట్టే మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కిస్తారా? (video)

Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments