Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

Advertiesment
Mega 157 Latest  poster

దేవీ

, బుధవారం, 28 మే 2025 (10:10 IST)
Mega 157 Latest poster
మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటిస్తున్న తాజా సినిమా మెగా 157 తాజా అప్ డేట్ ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభమైంది. కాగా, నేడు షూటింగ్ ప్రోగ్రెస్ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత, సుశ్మిత కొణిదెల ఫొటోను విడుదల చేశారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ మొయినాబాద్ లోని గురుకులం కాలేజీ జరుగుతోంది. ఇందులో చిరంజీవి కాలేజీ లెక్చరర్ గా నటిస్తున్న సమాచారం.
 
బుధవారంనాడు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. 20 ఏళ్ళ తర్వాత బాలీవుడ్ నటుడు శరత్ సక్సెనా ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి తో ఢీ అంటే ఢీ అనేలా కొన్ని సన్నివేశాలను కొద్దిరోజులలో తీయనున్నారు.
 
నేడు చిరంజీవితోపాటు పలువురు ఫైటర్లు, రౌడీలు కాలేజీ ఆవరణ బయట పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. నవకాంత్ ఫైట్ మాస్టర్ ఆద్వర్యంలో వినూత్నంగా యాక్షన్ లో ఎంటర్ టైన్ మెంట్ వుండేలా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారట. ఆల్ రెడీ సంక్రాంతికి వస్తున్నాం తరహాలో కాకుండా అంతకుమించి చిరంజీవి శైలిలో వుంటుందని తెలుస్తోంది. ఇంతకుముందు చిరంజీవి కుడిచేతితో నమస్కారం పెడుతూ వున్న స్టిల్ ను కూడా విడుదలచేశారు. గతంలో చిరంజీవి మాస్టర్ సినిమా చేశారు. ఇప్పుడు మాస్టర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల కలయికగా  వుండబోతుందని వినికిడి.
 
ఇంకా ఈ సినిమాలో కేథరిన్ కూడా నటిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుశ్మిత కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీమతి అర్చన ప్రజెంట్ చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!