Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

Advertiesment
Nayanthara, Anil Ravipudi

దేవీ

, శనివారం, 17 మే 2025 (13:47 IST)
Nayanthara, Anil Ravipudi
 
మెగాస్టార్ చిరంజీవి #Mega157 సినిమాలో నయనతార నటించడంలేదనీ, ఎక్కువ పారితోషికం అడుగుతుందనీ ఇటీవలే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటికి ఫుల్ స్టాఫ్ పెడుతూ నేడు చిత్ర టీమ్ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాలో నయనతార ఎంట్రీ ఇస్తుందని తెలిపారు. 
 
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి  ప్రాజెక్ట్ #Mega157 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి కంప్లీట్  హ్యుమరస్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది.
 
మ్యాసీవ్ ఎంటర్ టైనర్స్ ని క్రియేట్ చేయడంలో, వినూత్నమైన ప్రమోషన్లను రూపొందించడంలో పేరుపొందిన అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్ చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం విజయంతో దర్శకుడు #Mega157 ప్రమోషన్స్ కు తన సిగ్నేచర్ టచ్, ఒరిజినాలిటీని తీసుకువస్తున్నారు. ఈరోజు, చిరంజీవికి జోడిగా నయనతారను హీరోయిన్ గా పరిచయం చేయడానికి అనిల్ రావిపూడి న్యూ వీడియోను రిలీజ్ చేశారు.
 
ఈ వీడియోలో నయనతార తన టీంతో తెలుగులో మాట్లాడటం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్ పాటలు వినడం, స్క్రిప్ట్‌ను చదవడం, చిరు ఐకానిక్ డైలాగ్‌లలో ఒకదాన్ని చెప్పడం ఆకట్టుకుంది. ఫైనల్ గా, అనిల్ రావిపూడి ఆమెతో కలిసి న్యూస్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
 
సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్‌ తర్వాత చిరంజీవితో నయనతార మూడవసారి కలిసి పనిచేస్తున్న చిత్రం మెగా157. ఈ  యూనిక్ ప్రోమోలో ఆమె కనిపించడం రావిపూడి క్రియేటివిటీకి నిదర్శనం. ఈ వీడియో నయనతార పాత్ర యొక్క హిలేరియస్ నేచర్ ని సూచిస్తుంది.
 
నయనతార కోసం అనిల్ రావిపూడి ఒక అద్భుతమైన పాత్రను రాశారు, ఇది రిఫ్రెషింగ్‌గా, మెమరబుల్ గా ఉంటుంది. చిరంజీవి, నయనతారల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుంది.
 
అనౌన్స్ మెంట్ నుండి సాంకేతిక బృందాన్ని పరిచయం చేయడం, నయనతారను లీడ్ యాక్ట్రెస్‌గా ప్రకటించడం వరకు జరిగిన ప్రతి ప్రమోషన్ వినూత్నంగా, ఆకట్టుకునేలా సాగుతోంది.
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.  రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్.
 
ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదల కావడానికి టార్గెట్ గా పెట్టుకున్నారు. దర్శకుడు కొత్త ప్రమోషనల్ వీడియో ద్వారా “సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం”అని చెప్పడంతో మరోసారి కన్ ఫర్మ్ చేశారు.
 
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం - అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ ఎస్ ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రైటర్స్ - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
Vfx సూపర్‌వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
అడిషనల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌