Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Advertiesment
Sankrantiki... 100 days poster

దేవీ

, బుధవారం, 23 ఏప్రియల్ 2025 (11:04 IST)
Sankrantiki... 100 days poster
విక్టరీ వెంకటేష్ కు గతంలో సంక్రాంతికి సినిమా విడుదలకావడం సక్సెస్ సంపాదించడంతో విక్టరీ పేరును అభిమానులు ఇచ్చేశారు. అలా అయిన ఆయనకు కాలమార్పులో కొంచెం గడ్డు పరిస్థితి ఏర్పడింది. కానీ 2024 ఆయనకు అనిల్ రావిపూడి రూపంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో విజయం దక్కింది. అసలు ఈ టైటిల్ వెనుక ఓ విషయం దాగి వుంది. గతంలో ప్రతి సంక్రాంతికి హిట్ కొట్టే వెంకటేష్ ఈసారి సంక్రాంతి వచ్చి హిట్ కొట్టాలని దర్శకుడు అనిల్ తో చర్చించడంతో కథప్రకారం టైటిల్ ను కూడా అమరేలా చేశాడట.
 
ఇక అసలు విషయానికి వస్తే, నేటితో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వందరోజులకు చేరుకుంది. నంథ్యాలలోని శ్రీరామ థియేటర్ లో వందరోజులు పూర్తి చేసుకోవడంపట్ల హర్షంవ్యక్తం చేస్తూ చిత్ర టీమ్ శుబాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా  350 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు సోదరుడు శిరీష్ నిర్మించారు. కాగా, ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోనూ టీవీల్లోనూ కూడా ప్రసారం అయింది. అయినా వందరోజులు థియేటర్లో ప్రదర్శించడం విశేసంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం తమ స్టాప్ కు బోనస్ ప్రకటించినట్లు తెలుస్తోంది. గతంలో అఖండ సినిమా కూడా రాయలసీమలో ఏ థియేటర్ లో వందరోజులు ప్రదర్శించబడింది. ఇప్పటి ట్రెండ్ ను బట్టి థియేటర్ల జనాలు రాకపోవడంతో వెలవెలబోతున్న కొన్ని థియేటర్లు ఇలాంటి అరకొర సినిమాలు ఆడడం విశేషమేగదా..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?