Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.4 కోట్లు ఇస్తే నితిన్‌తో చేస్తానంటున్న తమిళ దర్శకుడి ప్రేయసి!

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:06 IST)
టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఈ యేడాది ఆరంభంలో "భీష్మ"గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రంలో తర్వాత నితిన్ నటిస్తున్న చిత్రం "రంగ్ దే". ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత 'అంధాధున్' అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నాడు. నితిన్ సొంత బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు. 
 
ఈ సినిమాకు సంబంధించి నటీనటులను ఖరారు చేసే పనిలో ప్రస్తుతం చిత్రబృందం బిజీగా ఉందట. మాతృకలో టబు, రాధికా ఆప్టే చేసిన పాత్రలకు తెలుగులో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాధిక చేసిన పాత్ర కోసం టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డేను చిత్రబృందం తాజాగా సంప్రదించినట్టు సమాచారం. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఈ సినిమాకు పూజ 'నో' చెప్పినట్టు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పి పూజ ఈ సినిమాను తిరస్కరించిందట. దీంతో మరో హీరోయిన్ కోసం గాలిస్తున్నారు. 
 
ఈ క్రమంలో నితిన్ దృష్టి సీనియర్ నటి నయనతారపై పడిందట. నిజానికి నయనతార కంటే ముందుగా రమ్యకృష్ణ, అనసూయ వంటి వాళ్ల పేర్లు వినిపించాయి. ఇటీవల ఇలియానాను సంప్రదిస్తే ఆమె తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. దీంతో నితిన్... నయనతార వెంటపడుతున్నారట. మంచి పాత్ర కావడంతో నయన్ కూడా ఆసక్తికరంగానే ఉన్నట్టు సమాచారం. అయితే రెమ్యునరేషన్ విషయంలోనే సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 
 
నితిన్ చిత్రాన్ని అంగీకరించేందుకు తనకు నాలుగు కోట్ల రూపాయలు కావాలని నయనతార డిమాండ్ చేస్తోందట. పైగా, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటానన్న షరతు కూడా విధిస్తోందట. వీటన్నింటిని నిర్మాత అంగీకరిస్తేనే నితిన్ చిత్రంలో తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రియురాలైన నయనతార నటించేందుకు అంగీకరిస్తుందట. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunitha, పులివెందులకు వెళ్లేందుకు భద్రత కావాలి: వైఎస్ సునీత

'బి-నేలమాళిగ’ తెరిచే అంశంపై చర్చ.. తుది నిర్ణయం పూజారులదే..

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments