Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

దేవీ
గురువారం, 20 మార్చి 2025 (10:16 IST)
Rashmika Mandanna
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తోంది. తన అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రశ్మిక. వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రశ్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి.

లేటెస్ట్ గా ఛత్రపతి శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమాలో యేసుబాయి పాత్రలో రశ్మిక నటన ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.
 
ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం తన క్రేజీ లైనప్ కంటిన్యూ చేస్తోంది రశ్మిక. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్, నాగార్జున, ధనుష్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర సినిమాలతో  పాటు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లో నటిస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రశ్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ కాబోతోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన రశ్మిక నటిస్తున్న సికిందర్ సినిమా ఈద్ పండుగ రిలీజ్ కు రెడీ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Gaddar Awards: గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments