రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

ఠాగూర్
సోమవారం, 1 సెప్టెంబరు 2025 (11:47 IST)
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్లో ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ అన్న ఒక్క మాటతో నర్గీస్ పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లుగా ఆమె తన వివాహాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
 
వివరాల్లోకి వెళితే, ఇటీవల జరిగిన ఈవెంట్లో నర్గీస్ ఫక్రీ, ఫరా ఖాన్ కలిసి రెడ్ కార్పెట్‌‍పై ఫోటోలకు పోజులిచ్చారు. అదే సమయంలో అక్కడే ఉన్న టోనీ బేగ్‌ను ఉద్దేశించి ఫరా ఖాన్, "టోనీ.. వచ్చి నీ భార్య పక్కన నిలబడు" అని పిలిచారు. ఈ ఒక్క పిలుపుతో నర్గీస్, టోనీ భార్యాభర్తలనే నిజం అందరికీ తెలిసిపోయింది. దీంతో అక్కడున్న వారితో పాటు, ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయారు.
 
అందిన సమాచారం ప్రకారం, నర్గీస్ ఫక్రీ, అమెరికాకు చెందిన వ్యాపారవేత్త టోనీ బేగ్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగింది. కాలిఫోర్నియాలో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. వివాహం అనంతరం ఈ జంట స్విట్జర్లాండ్ హనీమూన్ జరుపుకున్నట్లు సమాచారం. అంటే, వీరి పెళ్లయి ఇప్పటికే ఆరు నెలలు దాటిపోయింది. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే నర్గీస్, తన జీవితంలోని ఇంత ముఖ్యమైన విషయాన్ని ఇన్నాళ్లుగా రహస్యంగా ఉంచడంపై పలువురు చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments