Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య.. నాటకం బయటపడిందిలా...

Advertiesment
murder

సెల్వి

, శనివారం, 30 ఆగస్టు 2025 (13:51 IST)
హైదరాబాద్ సరూర్ నగరంలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హత్య చేసింది. నిద్రపోతున్న భర్త గొంతు నులిమి, ఆ తర్వాత డంబెల్‌తో తలపై మోది ప్రణాలు తీసింది. ఆపై ఏమీ తెలియనట్లుగా నాటకమాడినా పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. 
 
పోలీసుల కథనం ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన జల్లెల శేఖర్ (40), చిట్టి (30) అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం శేఖర్ దంపతులు సరూర్ నగర్ కోదండరామ్ నగర్‌కు వలస వచ్చి ఉంటున్నారు. శేఖర్ కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా, చిట్టి మాత్రం ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. ఈ క్రమంలో చిట్టికి స్థానికంగా ఉండే హరీశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో శేఖర్ ఆమెను నిలదీశారు. ఈ విషయంమై వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని చిట్టి తన ప్రియుడు హరీశ్‌తో కలిసి పథకం వేసింది. గురువారం రాత్రి తన కుమారుడిని గణేశ్ మండపం వద్ద స్నేహితులతో కలిసి పడుకోమని పంపించింది. అర్థరాత్రి దాటిన తర్వాత ప్రియుడు హరీశ్‌ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి గాఢ నిద్రలో ఉన్న శేఖర్‌ను మొదట గొంతునులిమి చంపేశారు. ఆ తర్వాత అతను మృతి చెందాడో లేదో అనే అనుమానంతో ఇంట్లో ఉన్న డంబెల్‌తో తలపై బలంగా మోదారు. ఆ తర్వాత హరీశ్ అక్కడ నుంచి పారిపోయారు. 
 
తెల్లవారుజామున చిట్టి 100 నంబరుకు ఫోన్ చేసి వచ్చి తన భర్త రాత్రి ఎవరితోనో గొడవపడి వచ్చి పడుకున్నాడని, ఉదయం లేవలేదని చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అయితే, చిట్టి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టింది. ప్రియుడు హరీశ్‌తో కలిసి తానే భర్తను హత్య చేసినట్టు అంగీకరించింది. దీంతో పోలీసులు చిట్టి, హరీశ్‌లను అరెస్టు చేసి తదుపరి విచారణ చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం.. నందమూరి సుహాసిని ఏం చెప్పారు?