Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హలో... నేను నీ భర్త రెండో భార్యను మాట్లాడుతున్నా: ఆ మాట వినగానే బస్సులోనే మృతి చెందిన మొదటి భార్య

Advertiesment
cell phone

ఐవీఆర్

, శనివారం, 30 ఆగస్టు 2025 (14:33 IST)
తన భర్త ఫోన్ నుంచి ఓ మహిళకు కాల్ వచ్చింది. అవతల ఫోనులో మాట్లాడేది స్త్రీ అయ్యేసరికి వెంటనే సదరు మహిళ అలెర్ట్ అయ్యింది. అవతల ఫోనులో మాట్లాడే స్త్రీ... నేను మీ ఆయన ఫోనులో నుంచి మాట్లాడుతున్నాను. నేను నీ భర్త రెండో భార్యను. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. మేమిద్దరం ఒకచోటే వుంటున్నాము అని ఫోన్ కట్ చేసింది. ఈ ఫోన్ కాల్ విన్న వెంటనే సదరు మహిళ బస్సు ఎక్కి భర్త దగ్గరకు బయలుదేరింది.

భర్త నివాసం వద్దకు వెళ్లి తనిఖీ చేయగా, తనకు ఫోన్ చేసిన మహిళ అక్కడే వుంది. ఐతే తన భర్త మాత్రం కనబడలేదు. ఎంతసేపు వేచి చూసినా అతడు రాలేదు, ఐతే రెండో భార్య అని చెప్పిన మహిళ మాత్రం వీరిని ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, నేను బైటకెళ్లాల్సిన పని వుంది. మీరు వెళ్లిపోతే నేను వెళ్తాను అంటూ దాదాపు వారిని గెంటేసినంత పనిచేసింది.
 
ఎదురుగా భర్త లేకుండా ఆ మహిళను ఏమీ చేయలేక నిస్సహాయస్థితిలో పడిపోయింది మహిళ. ఏం చేయాలో పాలుపోక తన తల్లిని తీసుకుని తిరుగు ప్రయాణమైంది. బస్సులో తన భర్త తనకు చేస్తున్న మోసం గురించి తల్లికి చెపుతూ తీవ్ర మనోవేదనకు గురైంది. అలా కన్నీటపర్యంతమవుతూనే తల్లి ఒడిలో కుప్పకూలింది. వెంటనే బస్సును సమీప బస్ స్టేషనులో ఆపి మహళను పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తన భర్త తనకు తీరని అన్యాయం చేసాడంటూ వెక్కివెక్కి ఏడ్చి గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు.
 
కాగా బాధితురాలు.. గత కొన్నేళ్లుగా టీబి వ్యాధితో బాధపడుతోందనీ, దాంతో ఆమెను పుట్టింట్లో వదిలేసాడు భర్త. ఇక అప్పట్నుంచి ఆమె అడపాదడపా భర్త వద్దకు వెళ్లి వస్తోంది కానీ అతడు ఇంత మోసానికి దిగుతాడని ఊహించలేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాధితురాలు జలాల్ పూర్ గ్రామం నుంచి వలస వచ్చి ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రుల వద్ద వుంటోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుల బాధ భరించలేక భర్తను చంపి భార్య ఆత్మహత్యాయత్నం