Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

దేవీ
శనివారం, 31 మే 2025 (16:49 IST)
R.Narayana Murthy
గెలిచిన తర్వాత మమ్మల్ని కలవాల్సింది అని పవన్ చేసిన వ్యాఖ్యలపై  నారాయణ మూర్తి  స్పందించారు. ఆయన మాటలు అతనకుముందే కొంతమంది బంద్ ప్రకటిస్తున్నామని ఛాంబర్ లో మీటింగ్ పెట్టడం కూడా తప్పే అంటూ నారాయణమూర్తి శనివారంనాడు అన్నారు. గతం కొద్దిరోజులుగా సినిమా రంగంలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటిని అందరూ కలిసి కట్టుగా కూర్చుని మాట్లాడుకోవాలి అని అన్నారు.
 
నారాయణ మూర్తి మాట్లాడుతూ,  పూర్వకాలంలో ప్రజల దగ్గరికే రాజులు వచ్చి వాళ్ళ సమస్యలు వినేవారు. అలాగే ఇప్పుడున్న మినిస్టర్ లు కూడా సినిమా రంగంలో సమస్యలు ఏమి వున్నాయో అని అడగాలి. పర్సెంటేజీ సిస్టమ్ కావాలి. ప్రైవేట్ సంస్థలు థియేటర్లను ఆక్యుపై చేశాయి. వాటిని మీరు పరిశీలించాలి. 
 
కొందరు ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి బంద్ ప్రకటించడం అనేది చాలా తప్పు. స్వయంగా పవన్ ఆఫీస్ నుంచి, సినిమాటోగ్రఫీ నుంచి బంద్రా గురించి వివరణ రావడం  విచిత్రం. అసలు బంద్ అనేది మూడు వారాలముందు తెలియజేయాలి. అది రూల్. అలా కాకుండా స్టేట్ మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. నిర్మాతల్ని ఇబ్బంది కలిగించకూడదు. పవన్ కళ్యాణ్ మీద ఎవరు కుట్రపన్నుతారు. గతంలో ఎన్.టి.ఆర్. తెలుగు జాతిని ఖ్యాతి తెచ్చారు. ఆ తర్వాత అంతటివాడిగా డిఫ్యూటీ సి.ఎం.గా ఎదిగిన పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ ఆఫీసు నుంచి లెటర్ రావాల్సిందికాదు. చంద్రబాబుతో మాట్లాడి హరిహరవీరమల్లు అనే టాపిక్ చెప్పకుండా సినిమా పెద్దల్ని రండి అని ఆహ్వానిస్తే చాలా మంచిది. ఈ విషయాన్ని సవినయంగా పవన్ గారికి విన్నవిస్తున్నాను అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహంకారంతో ఉన్న జగన్‌ను ఆకాశం నుంచి కిందికి దించాం : బీటెక్ రవి

ఓటు చేరీ అంటూ ఊకదంపుడు ప్రచారం వద్దు.. ఆధారాలు ఎక్కడ? రాహుల్‌‍కు ఈసీ ప్రశ్న

Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన- వీడియో వైరల్ (video)

మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం

Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments