Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్ ప్రైమ్‌లో వస్తానంటున్న 'నారప్ప'

Webdunia
సోమవారం, 12 జులై 2021 (16:41 IST)
విక్టరీ వెంకటేష్, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి జంటగా నటించిన చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కాబోతోంది. 
 
గత కొన్ని రోజులుగా ఈ చిత్ర విడుదల విషయంలో సందిగ్ధత నెలకొనివుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదలపై తాజాగా క్లారిటీ వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసేలా నిర్మాతల ప్లాన్ చేశారు. 
 
నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయడానికి ఆలోచిస్తున్నామని ప్రకటించిన నిర్మాత సురేష్‌ బాబు.. తన అభిప్రాయాన్ని మార్చుకుని ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం జూలై 20వ తేదీన స్క్రీనింగ్‌ కాబోతున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్‌ ప్రకటించింది.
 
ఇదే విషయాన్ని విక్టరీ వెంకటేష్‌ కూడా తన ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. నారప్ప చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లుగా ట్వీట్‌ చేశారు. 
 
ఒకవైపు పెద్ద చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ నిర్మాతలను తెలంగాణ ఫిల్మ్‌చాంబర్‌, ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ కోరుతుంటే.. మరోవైపు కోలీవుడ్‌లోని బడా నిర్మాతల్లో ఒకరైన డి.సురేష్ బాబు తమ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments