Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ బరిలో నాని "శ్యామ్ శింగారాయ్" - మూడు విభాగాల్లో..

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (08:56 IST)
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం శ్యామ్ సింగారాయ్. పునర్జన్మల ఆధారంగా తెరకెక్కింది. సాయిపల్లవి హీరోయిన్. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. ఇందులో నాని రెండు విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్నారు. ఇందులో దేవదాసిగా సాయిపల్లవి నటించి ప్రాణంపోసింది. అలాగే, కృతిశెట్టి, మ‌డొన్నా సెబాస్టియ‌న్‌లు త‌మ త‌మ న‌ట‌న‌తో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకున్నారు. 
 
అయితే, ఇపుడు ఈ చిత్రం ఆస్కార్ పోటీకి వెళ్ళింది. పీరియాడిక్ డ్రామా, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్, భారతీయ సంప్రదాయ క్లాసిక్‌ విభాగాల జాబితాలో నామినేషన్‌ పరిశీలనకు పంపారు. కాగా వ‌చ్చే ఏడాది 95వ ఆస్కార్ అవార్డుల వేడుక జ‌రుగ‌నుంది. శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. 
 
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం వండ‌ర్స్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైన మొద‌టి వారంలో టాప్‌10 నాన్-ఇంగ్లీష్ మూవీస్ కేట‌గిరిలో ఈ చిత్రం 3వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. అత్యధిక రేటింగ్‌ సాధించడంతోపాటు.. దాదాపు 10 వారాల పాటు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండ్‌లో ఉంది. నిహారిక ఎంట‌ర్‌టైన‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌ట్ బోయ‌న‌పల్లి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments