Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిన్‌ట్రీతో మీ మూలాలను కనుగొనండి: కుటుంబాలను కలిపే వేదిక ప్రారంభం

kintree
, సోమవారం, 1 ఆగస్టు 2022 (17:00 IST)
తెలియని వారితో కూడా అనుబంధం కొనసాగించేందుకు తోడ్పడుతున్న ప్రపంచమిది. కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే కాకుండా సుదూర బంధువులను కూడా కలపడమే లక్ష్యంగా కిన్‌ట్రీ తమ సేవలను ప్రారంభించింది. ఈ ఆల్‌-ఇన్‌-ఒన్‌ సోషల్‌ మీడియా వేదిక కుటుంబాలకు అత్యంత విలువైన, వినియోగదారులకు అనుకూలమైన వేదికగా నిలువనుంది. తమ కుటుంబాలలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటూనే, ఆ విషయాలు గోప్యంగా ఉండాలనుకునే వ్యక్తుల కోసం అవసరమైన సేవలను కిన్‌ట్రీ అందిస్తుంది.

 
నేటి వాతావరణంలో, ఒకరి సాంస్కృతిక వారసత్వం నిలుపుకోవడం అత్యంత కీలకమైన అంశం. తమ గుర్తింపు తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. కిన్‌ట్రీ ఇప్పుడు కుటుంబం కోసం ఓ వేదికను సృష్టించడంతో పాటుగా అవసరమైన పరిష్కారాలనూ అందిస్తుంది. ఇది తమ సొంత కుటుంబ సభ్యులతో పాటుగా ఆప్త బంధువులను సైతం జోడించుకునే అవకాశం అందిస్తుంది. దీని ప్రాధమిక ఫీచర్‌తో కుటుంబ చరిత్రను ఒడిసిపట్టుకునేందుకు తగిన అవకాశం కల్పిస్తూనే ఫ్యామిలీ ట్రీ  సృష్టించుకునే అవకాశమూ అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ యొక్కసులభమైన వినియోగ విధానం కారణంగా విభిన్న తరాల వ్యక్తులు కూడా సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. అంతేకాదు, కిన్‌ట్రీ అత్యంత సురక్షితమైన మాధ్యమాన్ని చిత్రాలు మార్పిడి చేసుకునేందుకు, వాటిని కుటుంబ సభ్యుల నడుమ పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇది పలు ప్రాంతీయ భాషలలో లభ్యమవుతుంది.

 
ఇఫ్తికార్‌ ఖాన్‌, శ్యామ్‌ జవేరీల మానస పుత్రిక కిన్‌ట్రీ. భాషా అవరోధాలను అధిగమించడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా బంధాలను బలోపేతం చేయడంను ఇది లక్ష్యంగా చేసుకుంది. ఈ వేదిక ఆవిష్కరణ గురింంచి కిన్‌ట్రీ కో-ఫౌండర్‌ ఇఫ్తికార్‌ ఖాన్‌ మాట్లాడుతూ, ‘‘కుటుంబం ఎప్పుడూ ముందే ఉంటుందన్నది మా ప్రగాఢ విశ్వాసం. కిన్‌ట్రీ కోసం విత్తనాన్ని మేము ఒకరి కుటుంబసభ్యులు లేదంటే దూరపు బంధువులను కలుసుకోవడానికి ఏర్పడిన అంతరాలను గమనించి నాటాము. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ బంధువులను వారు కలుసుకోవచ్చు. దూరమైన తమ బంధువులను ఎప్పుడైనా, ఎక్కడైనా,  ఏ సమయంలో అయినా  సురక్షిత మాధ్యమం ద్వారా  కనుగొనడంతో పాటుగా అనుసంధానింబడే అవకాశం అందిస్తుంది’’ అని అన్నారు.

 
కిన్‌ట్రీ కో-ఫౌండర్‌ శ్యామ్‌ జవేరీ మాట్లాడుతూ, ‘‘ఈ ప్రపంచం చాలా చిన్నది. కిన్‌ట్రీని వినియోగించడం ప్రారంభించిన తరువాత ఇది వాస్తవంగా మారుతుంది. మీలో చాలామందికి మీ కుటుంబసభ్యులలో 20% మందికి పైగా పేర్లు తెలిసి ఉండకపోవచ్చు. వారందరినీ కూడా ఇప్పుడు ఒకే స్ర్కీన్‌పై చూడవచ్చు. అంతేకాదు, గ్రాండ్‌పేరెంట్స్‌కు ఆవల మరెన్నో తరాలకు సైతం కిన్‌ట్రీ సహాయపడుతుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసు : ఆ ముగ్గురికి బెయిల్ నిరాకరించిన కోర్టు