ఆసుస్ జెన్ ఫోన్ 9 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ను అంతర్జాతీయంగా కొన్ని మార్కెట్లలోకి విడుదల చేసింది. భారత్‌లో ఎప్పుడు ఈ ఫోన్ ను విడుదల చేస్తుందన్న సమాచారం లేదు.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్‌తో ఆసుస్ జెన్ ఫోన్ 9 పనిచేస్తుంది. జెన్ ఫోన్ 8 జెడ్ మాదిరే 5.9 అంగుళాల స్క్రీన్‌తో ఉంటుంది. 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. అలాగే అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
ఇందులో వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉంటాయి. అందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో 12 మెగాపిక్సల్ సోనీ కెమెరా ఏర్పాటు చేశారు.
ఫీచర్స్
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ.. 8 జీబీ ర్యామ్,
256 జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో మూడు రకాల వేరియంట్లు ఉన్నాయి.