భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి షావోమి నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ నెల 20వ తేదీన రెడ్మీ కే50ఐ పేరుతో ఈ ఫోనును మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్‌లను సపోర్ట్ చేసేలా తయారు చేశారు.
5జీ నెట్‌వర్క్‌కు సంబంధించి అన్ని బ్యాండ్‌లని రిలయన్స్ జియో సంస్థతో కలిసి విజయవంతంగా పరీక్షించినట్టు సమాచారం. పైగా, 12 రకాల 5జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తున్న తొలి రెడ్మీ ఫోన్ కూడా ఇదే కావడం గమనార్హం. 8కే క్వాలిటీ వీడియోలను కూడా బఫరింగ్ లేకుండ చూడగలరు.
రెడ్మీ కే50ఐ ఫీచర్లను పరిశీలిస్తే, ఈ ఫోన్ మిడ్ శ్రేణిలో లభించనుంది. చాలా కాలంగా రెడ్మీ కంపెనీ కె సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రెడ్మీ కే50ఐ కోసం టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్‌లో 144 హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాలో ఎల్.సి.డి డిస్‌ప్లే అందిస్తున్నారు.
వెనుక వైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ కెమెరాలున్నాయి. ఈ ఫోను 6జీబీ, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ, 256 జీబీ వేరియంట్లలో తీసుకునిరానుంది. ఈ ఫోను ధర రూ.21 వేల నుంచి రూ.25 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల సమాచారం.