నోకియా నుంచి సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ అయ్యింది. నోకియా సీ21 ప్లస్ (Nokia C21 Plus) మొబైల్ భారత్‌లో మంగళవారం విడుదలైంది. నోకియా అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఈ మొబైల్ సేల్‌కు అందుబాటులో ఉంది. డార్క్ సియాన్, గ్రే కలర్ ఆప్షన్‌లో లభిస్తోంది.
లాంచ్ ఆఫర్ కింద ప్రస్తుతం ఈ మొబైల్‌ను కొంటే నోకియా వైర్డ్ బడ్స్ ఇయర్‌ఫోన్స్ ఉచితంగా పొందవచ్చు. త్వరలోనే ఈ-కామర్స్ సైట్లు, రిటైల్ స్టోర్స్‌లో కూడా నోకియా సీ21 ప్లస్ అమ్మకానికి రానుంది.
5050 mAh బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉండగా.. మూడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందంటూ నోకియా చెబుతోంది.
ఆండ్రాయిడ్ 11 గో (ఆండ్రాయిడ్ 11 Go) ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ వస్తుండగా.. రెండు సంవత్సరాలు అప్‌డేట్‌లు ఇవ్వనున్నట్టు తెలిపింది. వెనుక రెండు కెమెరాల సెటప్‌ను నోకియా సీ21 ప్లస్ కలిగి ఉంది. రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.
ఫీచర్స్
నోకియా సీ21 ప్లస్ 3 జీబీ + 32 జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.10,299గా ఉంది.
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ వేరియంట్ ధరను రూ.11,299గా నోకియా నిర్ణయించింది.