Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2022 జూన్‌లో హైదరాబాద్‌లో రిజిష్టరైన 5,408 అపార్ట్‌మెంట్లు: నైట్ ఫ్రాంక్ ఇండియా

buildings
, బుధవారం, 13 జులై 2022 (23:05 IST)
హైదరాబాద్‌లో 2022 జూన్‌లో 5,408 యూనిట్ల మేరకు రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా తాజా మార్కెట్ నివేదికలో నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. నిరంతర పెరుగుదల స్వీకరణ తరువాత మార్కెట్ కాస్తంత ఊపిరి పీల్చుకున్న నేపథ్యంలో విక్రయాల రిజిస్ట్రేషన్లు ఏటేటా ప్రాతిపదికన 2022 జూన్‌లో 25% మేర తగ్గాయి. 2022 జూన్‌లో విక్రయాలు కాస్తంత నియంత్రణలో ఉన్నప్పటికీ, హైదరాబాద్ అవుట్‌లుక్ మాత్రం ఆశాజనకంగానే ఉంది.

 
2022 రెండో త్రైమాసికంలో హైదరాబాద్‌లో 17,074 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏటేటా ప్రాతిపదికన 9.1% వృద్ధి. ఏటేటా ప్రాతిపదికన 25% వృద్ధితో 2022 రెండో త్రైమాసికంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువ రూ.8,685 కోట్లుగా ఉంది. తక్కువ సంఖ్యలో ఇళ్లు రిజిష్టర్ అయినప్పటికీ, రిజిష్టరైన ఇళ్ల సగటు విలువ మాత్రం గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే అధికంగా ఉంది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ పరిధిలోకి హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి వస్తాయి. 

 
2020 జూన్‌లో రిజిష్టర్ అయిన అన్ని రెసిడెన్షియల్ విక్రయాల్లో రూ.2.5- 5 మిలియన్ (రూ.25-50 లక్షల మధ్యలో) ధర బాండ్ వద్ద ఉన్నవి 53%గా పెరిగాయి. 2021 జూన్‌లో దీని వాటా 35%గానే ఉండింది. రూ.2.5 మిలియన్ల (రూ.25 లక్షల) కన్నా తక్కువ టికెట్ సైజులో డిమాండ్ బలహీనపడింది. ఏడాది క్రితం దీని వాటా 40% ఉండగా, ఇప్పుడది 16% గా ఉంది. పెద్ద టికెట్ సైజ్ ఇళ్ళకు భారీగా డిమాండ్ ఉంది. రూ.5 మిలియన్లు (రూ.50 లక్షలు), అంతకుమించిన టికెట్ సైజ్ ఆస్తుల విక్రయ రిజిస్ట్రేషన్ల సంచిత వాటా 2021 జూన్‌లో 25% నుంచి 2022 జూన్ లో 32 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసింది- భారత్ పై ఇలాంటి వదంతులు ఎందుకు వస్తున్నాయి