Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పటికీ నాతో కలిసి పనిచేయడానికి జంకుతున్నారు : సన్నీ లియోన్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (20:09 IST)
అడల్ట్ చిత్రాల నటి సన్నీ లియోన్ తాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆరంభంలో పోర్న్ చిత్రాల్లో నటించిన మాట నిజమేనని, అయితే, ఆ చిత్రపరిశ్రమను వదిలివేసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి పదేళ్లు అయిందని తెలిపారు. ఇప్పటికీ తనతో కలిసి పని చేసేందుకు అనేక మంది వెనుకంజ వేస్తున్నారని సన్నీ లియోన్ అంటున్నారు. 
 
గత 2012లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీ లియోన్... ఆమె నటించిన తొలి చిత్రం "జిస్మ్-2". అయితే పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "2012లో పరిశ్రమలో అడుగుపెట్టే నాటికి నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తి. నేను మెరుగైన జీవితం గురించి ఆలోచించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. 
 
పైగా, ఇప్పటివరకు తాను చేసిన పాత్రల విషయంలోను సంతోషంగానే ఉన్నట్టు చెప్పారు. అందులో మంచి, చెడు ఎంపికలు కూడా ఉన్నాయని వెల్లడించారు. అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. నేను అడుగుపెట్టినపుడు ఈ స్థాయిలో పరిశ్రమను ప్రేమిస్తానని ఊహించలేదన్నారు. నాకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
అయితే, ఇప్పటికీ నాతో కలిసి పని చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపడంలేదు. అదేవిధంగా పేరొందిన నిర్మాణ సంస్థలు, వ్యక్తులు సైతం ఇప్పటికీ నాతో కలిసి పని చేయడానికి సంకోచిస్తున్నారు. కానీ, ఇదేమీ నన్ను బాధపెట్టదు. ఏదో ఒక రోజు వారితోనూ కలిసి పని చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నాను అని 41 యేళ్ళ సన్నీ లియోన్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం