Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధానికి సిద్ధం కండి... నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్ రిలీజ్

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (12:18 IST)
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. జెర్సీ చిత్రం తర్వాత నటించిన ఈ చిత్రం వచ్చే నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. విక్రమ్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కించారు. 
 
ఈ క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్‌లో స్పీడ్ పెంచారు. ఇప్ప‌టికే ప్రీ లుక్, ఫ‌స్ట్ లుక్ , సాంగ్, టీజ‌ర్ అంటూ చిత్రానికి సంబంధించి ప‌లు అప్‌డేట్స్ ఇచ్చిన టీం తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ చేసింది. పెన్సిల్‌, అత‌ని గ్యాంగ్ చేసే సంద‌డిని ట్రైల‌ర్‌లో చూపించారు. పెన్సిల్ పార్థసార‌ధి పాత్ర‌లో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్ అని టీజ‌ర్‌ని బ‌ట్టి అర్థమైంది. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..రివెంజర్స్ అసెంబుల్ అనే వ్యాఖ్యను జోడించి విడుద‌లైన‌ ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తించింది. 
 
ఇందులో ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. స‌రికొత్త క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం అందించ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్‌ని చూస్తే అర్థమవుతుంది. ఆ ట్రైలర్‌ను మీరూ ఓసారి చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments