Webdunia - Bharat's app for daily news and videos

Install App

వితికపై వరుణ్‌ల గొడవ.. మొహంపై కాఫీ పోయడం.. డ్రెస్ చించేయడం..?

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (11:57 IST)
తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ఆరో వారంలో అడుగుపెట్టింది. వరుసగా నాలుగు వారాల పాటు జరిగిన ఈ షోకు రేటింగ్ విషయంలో మాత్రం చుక్కెదురైంది. రేటింగ్‌ బాగా పడిపోయింది. ఇక ఈ షో రేటింగ్ పెంచడం కోసం ఇంటి సభ్యుల మధ్య గొడవ పెట్టడం.. వారిలో వారు కొట్టుకోవడం వంటివి చేస్తున్నారు. బిగ్‌బాస్ నిన్నటి ఎపిసోడ్‌పై సర్వత్రా ఆసక్తి కలిగేలా చేశాడు.  
 
మంగళవారం ఉదయం విడుదలైన ప్రోమోలో వరుణ్‌ మరియు వితికలు చాలా సీరియస్‌గా గొడవ పడటం చూపించారు. దాంతో రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు అంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. షో ప్రారంభం అయిన తర్వాత అసలు విషయం తెల్సిందే. అది కేవలం సీక్రెట్‌ టాస్క్‌లో భాగమే అని, అందుకోసం వరుణ్‌ చాలా సీరియస్‌గా వితికపై రియాక్ట్‌ అయ్యాడంటూ తేలిపోయింది. 
 
మొహంపై కాఫీ పోయడం నుండి ఇంకా ఆమె డ్రస్‌ చించేయడం వరకు అంతా కూడా సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగానే జరిగింది. ఆ గొడవం అంతా కూడా బిగ్‌బాస్‌ డ్రామా అని ప్రేక్షకులకు తేలిపోయింది. ఎంతో ఉత్కంఠను రేపిన గొడవ నీటిపై రాత మాదిరిగా ఊరికే చెదిరిపోయింది.
 
ఇకపోతే.. బిగ్ బాస్ మూడో సీజన్‌లో జనం బాబా భాస్కర్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి వారం బాబా భాస్కర్‌కి అత్యధిక ఓట్లు పోల్‌ అవుతున్నాయి. ఆరుగురికి పైగా నామినేషన్లలో వున్నా కానీ అతనికి నలభై శాతానికి పైగా ఓట్లు పోల్‌ అవుతున్నాయి. అయితే ఈ సంగతిని ఇంతవరకు అతడికి తెలియనివ్వలేదు. 
 
ఎక్కువ ఓట్లు వచ్చిన సభ్యుడి పేరు ముందుగా చెప్పాలి కానీ ప్రతిసారీ కావాలని బాబా పేరు మధ్యలో చెబుతున్నారు. అలాగే అతడు ముసుగు వేసుకుని గేమ్‌ ఆడుతున్నాడని నాగార్జునతోనే పదే పదే అనిపిస్తున్నారు. శ్రీముఖి, అలీ రెజా, పునర్నవి లాంటి వారిని నాగార్జున కామెంటరీతో పైకి లేపుతూ బాబాని డీఫేమ్‌ చేయాలని చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments