Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో నాని.... 'బిగ్ బాస్' షోలో ఏది తప్పో.. ఏది ఒప్పో చెప్పలేరా?

బిగ్‌బాస్‌ షోలో ఉన్న లోపాయికార వ్యవహారాలు, అస్పష్టమైన నిబంధనలు వెరసి హోస్ట్‌గా ఉన్న నానిని ఇబ్బందిపెడుతున్నాయి. బిగ్‌బాస్‌ ఇంటిలో టాస్క్‌లు ఆడే సందర్భంగా తలెత్తిన విభేదాలలో ఎవరు కరెక్టో, ఎవరు తప్పోనని ఇంటి సభ్యులు తేల్చుకోలేని స్థితిలో ఉండటం రోజూ కని

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (15:37 IST)
బిగ్‌బాస్‌ షోలో ఉన్న లోపాయికార వ్యవహారాలు, అస్పష్టమైన నిబంధనలు వెరసి హోస్ట్‌గా ఉన్న నానిని ఇబ్బందిపెడుతున్నాయి. బిగ్‌బాస్‌ ఇంటిలో టాస్క్‌లు ఆడే సందర్భంగా తలెత్తిన విభేదాలలో ఎవరు కరెక్టో, ఎవరు తప్పోనని ఇంటి సభ్యులు తేల్చుకోలేని స్థితిలో ఉండటం రోజూ కనిపిస్తున్నది. అయితే…. ఈ విషయంలో నాని కూడా నిస్సహాయంగా కనిపిస్తున్నారు. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో చెప్పలేని స్థితిలో నాని ఉన్నారు.
 
ఈ వారం ఆడోళ్లు-మగోళ్లు టాస్క్‌ జరిగింది. ఆడవాళ్లకు కొన్ని నాణేలు, మగవాళ్లకు కొన్ని నాణేలు ఇచ్చారు. కిచెన్‌, బెడ్‌రూం ఆడవాళ్ల ఆధీనంలో పెట్టారు. బాత్‌రూం, లివింగ్‌ రూం మగాళ్ల ఆధీనంలో ఉంచారు. ఒకరి ప్రాంతంలోకి ఇంకొకరు వెళ్లాలంటే… ఎంతోకొంత డబ్బులు చెల్లించి వెళ్లాలి. ఒక విధంగా ఇది రెండు గ్రూపుల మధ్య బేరసారాల శక్తిసామర్థ్యాలను పరీక్షించడానికి పెట్టిన పరీక్ష.
 
అయితే… టాస్క్‌ ప్రారంభంలోనే… ఆడవాళ్లకు సంబంధించిన కాయిన్స్‌ మూటను కూడా కౌశల్‌ తీసేసుకున్నారు. అడిగితే… ఎంతసేపయినా మీరు తీసుకోలేదు కాబట్టి నేను తీసేసుకున్నాను అని వాదిస్తూ వచ్చారు. కౌశల్‌ వాదనను మిగతా సభ్యులు ఆమోదించలేదు. ఆవిధంగా కాయిన్స్‌ తీసేకుంటే ఇక ఆట ఆడేదేముంటుందని బాబు గోగినేని, తనీష్‌, అమిత్‌ వంటివాళ్లు వాదించారు. మహిళల టీంలోనూ కొందరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదీ తేలకుండానే… గొడవపడుతూనే ఆట ఆడారు.
 
రెండు రోజులగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. కానీ బిగ్‌బాస్‌ కల్పించుకని అలా చేయడం తప్పని గానీ, చేయవచ్చని గానీ చెప్పలేదు. తీరా ఆ బాధ్యత నాని నెత్తిన పడింది. మహిళల కాయిన్స్‌ తీసుకోవడం తప్పేనని నాని చెప్పారు గానీ…. ఆ పని చేసిన కౌశల్‌ను తప్పుబట్టలేకపోయారు. ఆ మాట కౌశల్‌కు చెబితే… గతంలో ఇదేవిధంగా ఆడిన పలు టాస్క్‌లను ప్రస్తావనకు తెస్తారు. అప్పుడు కరెక్టు అయింది ఇప్పుడు తప్పు ఎందుకు అవుతుందని నిలదీస్తారు. అందుకే తప్పు చేసిన వ్యక్తిని నిర్దుష్టంగా ప్రశ్నించకుండా జనరల్‌గా తప్పు అని తేల్చి వదిలేశారు. అసలు విషయాన్ని వదిలేసి దాని చుట్టూ నడిచిన వాదనలను, సంభాషణలను మాత్రం పట్టుకుని, కాస్త మెత్తగా ఉండే సభ్యులపై పడ్డారు.
 
ఇటువంటి పరిస్థితి నానికి తలెత్తడానికి ప్రధాన కారణం బిగ్‌బాస్‌ అని చెప్పాలి. బిగ్‌బాస్‌ ఇస్తున్న టాస్క్‌ నిబంధనలు అస్పష్టంగా ఉంటున్నాయి. సభ్యులు గొడవ పడటానికే ఆస్కారం కల్పిస్తూ ఉద్దేశపూర్వకంగానే ఆ విధంగా చేస్తున్నారన్నది సుస్పష్టం.
 
ఇటువంటప్పుడు… నాని కూడా తెలివిగా వ్యవహరించాలి. ఈ నిబంధనలపైన పెద్దగా చర్చ పెట్టకుండా తానూ తప్పించుకోవాలి. లేదా బిగ్‌బాస్‌ ఏమనుకున్నా ఫర్వాలేదనుకుని మొదటి నుంచి ఒకే పద్ధతిలో తప్పొప్పులను విశదీకరించేలా ఉండాలి. ఒకసారి తప్పుని, ఇంకోసారి ఒప్పని చెబితే…. ప్రేక్షకుల ముందు నాని పలచనైపోతారు. నిబంధనలు పక్కాగా ఉండాలనే విషయాన్ని అవసరమైతే బిగ్‌బాస్‌కూ చెప్పాలి. ఆట ఆడేటప్పుడే నిబంధనల్లోని గందరగోళాన్ని సవరించే అవకాశం బిగ్‌బాస్‌కు ఉంటుంది. ఆ పని బిగ్‌బాస్‌నే చేయమని చెప్పాలి.
 
ఇక ఈ శనివారం ఎపిషోడ్‌లో ప్రధానంగా… కౌశల్‌ ధిక్కార స్వరం వినిపించారు. ఆడోళ్లు-మగోళ్లు టాస్క్‌లో కౌశల్‌ చేసిన తప్పును ఎత్తిచూపలేని నాని నిస్సహాయతను గుర్తించాడో ఏమోగానీ…. 'నాని గారూ నేను ఒకటి అడుగుతాను చెప్పండి… ఈ హౌజ్‌లో సభ్యులు నిష్పక్షపాతంగా ఆడుతున్నారా’ అని ప్రశ్నించారు. దానికి నాని ఏదో సమాధానం చెప్పగా…. 'ఇలాగైతే నన్ను టాస్క్‌లలో భాగస్వామిని చేయొద్దు’ అంటూ ధిక్కార స్వరం వినిపించారు. 
 
దీంతో నాని బుజ్జగిస్తున్నట్లు మాట్లాడారు. ‘మీరు ఇంటి సభ్యుల కోసం ఆడుతున్నారా…. ప్రేక్షకుల కోసం ఆడుతున్నారా? మిమ్మల్ని విజేతలుగా నిలిపేది ఇంటి సభ్యులా… ప్రేక్షకులా’ అని సముదాయించేలా మాట్లాడాల్సివచ్చింది. కౌశల్‌కు మద్దతుగా బయట కౌశల్‌ ఆర్మీ పేరుతో ఒక సైన్యం పని చేస్తోంది. నాని అదేపనిగా కౌశల్‌ను తప్పుబడుతున్నారంటూ గతవారం ఆ ఆర్మీ నానిపై సోషల్‌ మీడియాలో దాడి చేసింది. ఈ దాడిని దృష్టిలో ఉంచుకునే కౌశల్‌ పట్ల మెత్తగా వ్యవహరించారన్న ఆరోపణలూ వస్తున్నాయి.
 
ఇదిలావుండగా నూతన్‌ నాయుడు నాటకీయత మరోసారి బయటపడింది. అందర్నీ ‘ఒరే…ఒరే..’ అని సంబోధించడంపై నూతన్‌ను నాని ప్రశ్నించారు. కొత్తగా ఈ ధోరణి ఏమిటని నిలదీసినట్లు అడిగారు. దానికి అతను ‘నాకంటే చిన్నవారిని గౌరవించి మాట్లాడితే ఆయు:క్షీణమని చెప్పారు. అందుకే అలా మాట్లాడుతున్నా’ అంటూ తలాతోక లేని సమాధానం ఇచ్చారు. వయసులో మనకంటే చిన్నవారైనా గౌరవించడం ఆయు:క్షీణమవుతుందా? ఇటువంటి సమాధానం ఇచ్చిన నూతన్‌ గట్టిగా కార్నర్‌ చేయలేకపోయారు నాని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments