Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ద్యావుడా... బిగ్ బాస్‌లో ఆ టాస్క్‌లు ఏంటి...?

బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు అర్థంపర్థం లేకుండా ఉన్నాయి. అన్ని టాస్కులలోనూ అస్పష్టత, అసంబద్ధత కనిపిస్తోంది. రక్తి కట్టించడానికి, వినోదం పంచడానికి అవకాశం ఉన్నా టాస్కును రూపొందించడంలోని లోపాల వల్ల అది తుస్సుమంటోంది‌. చెరకురసం ఫ్యాక్టరీ టాస్కునే తీసుకుంట

Advertiesment
Big Boss Telugu2 show review
, శనివారం, 30 జూన్ 2018 (22:27 IST)
బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు అర్థంపర్థం లేకుండా ఉన్నాయి. అన్ని టాస్కులలోనూ అస్పష్టత, అసంబద్ధత కనిపిస్తోంది. రక్తి కట్టించడానికి, వినోదం పంచడానికి అవకాశం ఉన్నా టాస్కును రూపొందించడంలోని లోపాల వల్ల అది తుస్సుమంటోంది‌. చెరకురసం ఫ్యాక్టరీ టాస్కునే తీసుకుంటే… చాలా బోరింగ్‌గా ఉంది. రెండురోజులు సాగదీయడం వల్ల సుత్తిగా తయారయింది.
 
చెరకు గడల నుంచి బిగ్ బాస్ కోరిన మేరకు రసం తీసి బాటిళ్లలో నింపడం ఈ టాస్కు. మొదటి రోజు వరకు కాస్త బాగుంది గానీ రెండో రోజు విసుగు తెప్పించింది. రెండు గ్రూపుల్లోని యజమానులకు కాస్త డబ్బులిచ్చి… ఆ టీంలలోని వర్కర్లకు పనిని బట్టి కూలీగా ఇవ్వమని చెప్పారు. ఎవరి వద్ద ఎక్కువ డబ్బులుంటే ఆ వర్కర్ గెలిచినట్లు అని చెప్పారు. 
 
అంటే డబ్బులు సంపాదిండానికి వర్కర్లు పోటీపడేలా ఉండాలి. అలా కాకుండా ఒక టీంలోని వారంతా ఎవరూ డబ్బులు తీసుకోకుండా ఒకరికే ఇచ్చి ఎక్కువ డబ్బులు చూపించి ఆ ఒక్కరిని గెలిపించారు. ఈ విధంగా ఎల్లో టీంలోని తేజస్విని గెలిచారు. అలా కాకుండా ఇద్దరిద్దరిని ఒక బ్యాచ్‌గా విభజించి, నిర్ణీత సమయంలో ఎవరు ఎక్కువ బాటిళ్ల రసం ఉత్పత్తి చేస్తే దాన్నిబట్టి డబ్బులు ఇచ్చేలా నిర్ణయించి వుంటే రెండో రోజూ రసవత్తరంగా ఉండేది. అలా కాకున్నా యజమానులను పిలిచి ఎక్కువ డబ్బులు మిగుల్చుకోవాలని సీక్రెట్ టాస్క్ ఇచ్చివున్నా ఆట ఇంకాస్త రక్తికట్టేది. 
 
సభ్యులు లోపాయికారి వ్యవహారాలకు అవకాశం లేకుండా మరింత జాగ్రత్తగా టాస్కులు రూపొందించాలి. మొదటి వారం కెప్టెన్ ఎంపిక టాస్క్‌లోనూ సభ్యులు కూడబలుక్కుని, తమకు నచ్చిన వారిని కెప్టెన్‌ను చేశారు. దీంతో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌కు అర్థం లేకుండాపోయింది. అసలు టాస్కులు ఇంత పేలవంగా ఎందుకుంటున్నాయన్నది ప్రశ్న. మరోవైపు కొన్ని టాస్కుల్లో పార్టిసిపెంట్స్ మధ్య చోటుచేసుకుంటున్న సన్నివేశాలు ఏదోగా వుంటున్నాయంటూ కామెంట్లు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చూడాలనిపించే 'నా లవ్‌ స్టోరీ'... రివ్యూ రిపోర్ట్