Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని చిత్రం అంటే సుంద‌రానికీ షూటింగ్ పూర్తి

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (13:48 IST)
Nani-sundaraniki
నేచురల్ స్టార్ నాని  హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం `అంటే  సుందరానికీ..`. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. రోమ్-కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.
 
ఈ సంద‌ర్భంగా  ``ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్తయింది. `అంటే సుందరానికి` అని ప్రకటించిన నాని సెట్స్ చివరి రోజు తీసిన ఒక వీడియోను సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.
 
నూతన సంవత్సరం సందర్భంగా  విడుద‌లైన `అంటే సుందరానికీ..` ఫస్ట్ లుక్ లో నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆశ్చర్యపరిచాడు. ఫ‌స్ట్ లుక్‌తోనే ఇదొక డిఫ‌రెంట్ మూవీ అని తెలియ‌జేశారు నాని.  ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో  `కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్` అనేది నాని పాత్ర పేరు.
 
అంటే సుందరానికి చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్ కాగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌.
 
తారాగ‌ణంః నాని, న‌జ్రియా ఫ‌హ‌ద్‌, న‌దియ‌,హ‌ర్ష వ‌ర్ధ‌న్‌,రాహుల్ రామ‌కృష్ణ‌,సుహాస్‌
 
సాంకేతిక వ‌ర్గంః
ర‌చ‌న‌, ద‌ర్శ‌కత్వం: వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ వై
బ్యాన‌ర్‌: మైత్రి మూవీ మేక‌ర్స్‌
సీఈఓ: చెర్రీసంగీతం: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫి: నికేత్ బొమ్మి
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజ‌ల‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ల‌త నాయుడు
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ప‌ల్ల‌వి సింగ్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనిల్ భాను,

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments