బయటెక్కడో ఉన్నాడు. ఉండకూడదు.. మన పిల్లలు సేఫ్‌గా ఉంటారా..?

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:12 IST)
Nani Mahesh
నేచురల్ స్టార్ నాని 'బయటెక్కడో ఉన్నాడు. ఉండకూడదు' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది సినిమాల గురించి కాదు. ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నాని స్పందన. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఓ ఆరేళ్ళ చిన్నారిని క్రూరంగా హత్యాచారం చేసిన నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలతో పాటు సెలెబ్రిటీలు సైతం ఈ అమానవీయ ఘటనపై మండిపడుతున్నారు. 
 
పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకోవాలని, వాడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుడు పొరపాటున ఎవరి కళ్ళల్లోనైనా పడ్డాడంటే అంతే సంగతులు. ఈ నేపథ్యంలో ఘటనపై మంచు మనోజ్, మహేష్, నాని వంటి సెలెబ్రిటీలు సైతం తమ గళం వినిపిస్తున్నారు. తాజాగా నాని 'బయటెక్కడో ఉన్నాడు. ఉండకూడదు' అంటూ ఈ ట్వీట్ ను పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి జారీ చేసిన వాంటెడ్ నోట్ ను యాడ్ చేశారు.
 
ఇప్పటికే మంచు మనోజ్ సైతం ఆ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించగా, మహేష్ బాబు కూడా 'మన పిల్లలు సేఫ్‌గా ఉంటారా ?' అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకుని ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై దుమారం చెలరేగుతుండడంతో పోలీసులు కూడా ఈ విషాదకర ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. 
 
ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అతని ఫోటోను బయట పెడుతూ నిందితుడిని పట్టించిన వారికి 10 లక్షల బహుమానం ఉంటుందని ప్రకటించారు. నిందితుడి పేరు రాజు. అతనికి సంబంధించితిన్ గుర్తులను సైతం ఈ వాంటెడ్ నోట్ లో స్పష్టంగా వెల్లడించారు పోలీసులు. చుట్టూ ఓ కన్నేసి ఉంచండి. ఇలాంటి రాక్షసులు మన మధ్యనే దాగి ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

Bahubali: ఇస్రో అదుర్స్: జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి CMS-03 ఇస్రో హెవీలిఫ్ట్ రాకెట్

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments