Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని కోసం కొత్త అమ్మాయిని బుక్ చేసిన నిర్మాతలు!!

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (13:44 IST)
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని. ఈయనతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. పైగా, ఇది హీరో నానికి 28వ చిత్రం. ఈ చిత్రం టైటిల్‌ను ఈ నెల 21వ తేదీన ప్రకటించనున్నారు.
 
ఇక ఈ దీపావళికి తెలుగు సినిమా కుటుంబానికి మరో వ్యక్తిని కలుపుతున్నామని తెలుపుతూ.. ఈ చిత్రంలో హీరోయిన్ గురించి వెల్లడించారు. ఏడేళ్ళ క్రితం వచ్చిన 'రాజా రాణి' ఫేం నజ్రియా ఫహద్ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు నిర్మాతలు ప్రటించారు. 
 
ఈ నెల 21న సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందని.. డేట్‌మార్క్ చేసుకోవాలని సూచించారు నాని. ఆలోగా హ్యాపీ దీపావళి అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ''అంటే..'' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ అప్‌డేట్స్ ఇస్తుండగా.. సినిమా టైటిల్ కూడా ఈ ప్రాసలోనే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.
 
ఇకపోతే, ఈ ట్వీట్‌పై నెటిజన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. నజ్రియాకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్తున్న ఆడియన్స్.. తనను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడటం సంతోషంగా ఉందంటున్నారు. ఇక నాని ప్రస్తుతం "టక్ జగదీష్", "శ్యామ్ సింగ రాయ్" సినిమాలతో బిజీగా ఉండగా.. ఈ ప్రాజెక్టులు పూర్తి కాగానే కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments