అఖిల్ తరహాలోనే మోక్షజ్ఞ కూడా... వెండితెర ఎంట్రీ

వెండితెరపై వెలుగులు వెలిగిన స్వర్గీయ ఎన్.టి.రామారావు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుల వారసులైన బాలకృష్ణ, నాగార్జునలు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో దుమ్ము దులుపుతున్నారు. ఇప్పుడు వారి వారసులు కొంతమంది

Webdunia
గురువారం, 19 జులై 2018 (11:15 IST)
వెండితెరపై వెలుగులు వెలిగిన స్వర్గీయ ఎన్.టి.రామారావు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుల వారసులైన బాలకృష్ణ, నాగార్జునలు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో దుమ్ము దులుపుతున్నారు. ఇప్పుడు వారి వారసులు కొంతమంది ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా మరికొందరు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమౌతున్నారు.
 
అక్కినేని కుటుంబ కథా చిత్రం "మనం" సినిమా ద్వారా అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేశాడు. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. 'మనం'లో గెస్ట్ రోల్ తర్వాత అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 
 
ఇకపోతే, నందమూరి రెండోతరం వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటులుగా ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమౌతున్నాడు. మూడేళ్ళ క్రితమే మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొద్దామని అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. 
 
ఈ నేపథ్యంలో బాలకృష్ణ వందో సినిమా "గౌతమీపుత్ర శాతకర్ణి" ద్వారా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేద్దామని దర్శకుడు క్రిష్ కోరగా, అందుకు బాలయ్య అంగీకరించలేదు. ఇప్పుడు సమయం రావడంతో.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ద్వారా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయబోతున్నారు.  
 
నూనూగు మీసాల వయసులో నిమ్మకూరులో అల్లరి చిల్లరిగా తిరిగే ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో మోక్షజ్ఞ కనిపించబోతున్నట్టు సమాచారం. మోక్షజ్ఞ రోల్ 15 నిముషాలు ఉంటుందని తెలుస్తోంది. మరి యంగ్ ఎన్టీఆర్ పాత్రలో మోక్షజ్ఞ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

Free schemes: ఉచిత పథకాలను ఎత్తేస్తేనే మంచిదా? ఆ ధైర్యం వుందా?

Chandra Babu: విద్యార్థులకు 25 పైసల వడ్డీకే రుణాలు.. చంద్రబాబు

కడపలో రూ. 250 కోట్లతో ఎలిస్టా తయారీ కర్మాగారాన్ని ప్రారంభించిన నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments