Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి బాలకృష్ణ NBK108 షూటింగ్లో జాయిన్ అయిన శ్రీలీల

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (18:37 IST)
Srileela
గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయింది. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకృష్ణ చేయి పట్టుకున్నట్లుగా వున్న బ్యూటీఫుల్ స్టిల్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. #NBK108లో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి
 
#NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.  బాలకృష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన ఎస్ థమన్ #NBK108కి సంగీతం సమకూరుస్తున్నారు. బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ షైన్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా వుంది.  
 
సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..  తమ్మిరాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. వి వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం - 600 మంది వరకు మృత్యువాత

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 622కి పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయం

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

National Nutrition Week: జాతీయ పోషకాహార వారం.. ఇవి తీసుకుంటే?

ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments