Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో నాగార్జున ది ఘోస్ట్ భారీ షెడ్యూల్ పూర్తి

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (16:25 IST)
Nagarjuna, Sonal Chauhan
కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అత్య‌ద్భుత‌మైన యాక్షన్ ఎంటర్‌టైనర్ `ది ఘోస్ట్‌`లో నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది.
 
ఇదిలా వుండ‌గా, దుబాయ్‌లో కీలకమైన షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. విజువల్స్, లొకేషన్స్, అధునాత‌న సాంకేతికతతో లావిష్‌గా గ్రాండ్ స్కేల్‌లో రూపొందించారు. ది ఘోస్ట్ సినిమా యాక్ష‌న్ చిత్రాలు, విజువ‌ల్ ఫీస్ట్‌ను ఆస్వాదించేవారికి కొత్త అనుభ‌వాన్ని క‌లిగిస్తుంది. ముఖ్యంగా, ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని అన్ని స్టంట్ సీక్వెన్స్‌లలో ప్రధాన హైలైట్ గా వుండ‌నున్నాయి.
 
ఈ పోస్టర్లలో చూపించిన‌ట్లుగా, ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్లుగా కనిపించనున్నారు.  గుల్ పనాగ్,  అనిఖా సురేంద్రన్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.
 
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments