Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపేంద్ర, పోసాని మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణం తెలుసా!

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (16:07 IST)
Upendra, Posani
న‌టీన‌టుల మ‌ధ్య తార‌త‌మ్యాలు, మ‌న‌స్ప‌ర్థ‌లు వుండ‌డం మామూలే. ప‌ర‌బాషా నటుల మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌గా వుంటుంది. క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర భిన్న‌మైన పాత్ర‌లు పోషించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా పాత్ర‌లు వేసేవాడు. టైటిల్స్ కూడా `రా`, ? - వంటి చిత్ర‌మైనవి పెట్టి ప‌జిల్‌గా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాడు. అలాంటి ఆయ‌న‌కు అభిమానులుకూడా చాలా మందే వున్నారు. అది క‌న్న‌డ‌లో అయితే ప‌ర్వాలేదు. తెలుగులోకూడా అభిమానులుండ‌డంతో కొన్ని సినిమాలు అప్ప‌ట్లో స‌క్సెస్ అయ్యాయి. అలాంటి ఉపేంద్ర‌తో ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళీ ఓ క‌థ‌ను రాసుకుని ఆయ‌న చెప్పాడు. ఓకే అన్నాడు. ద‌ర్శ‌క‌త్వం కూడా నేనే చేస్తాను. నువ్వు న‌టించాలి అని ఉపేంద్ర‌ను అడ‌గంతో ఉపేంద్ర‌కు ఇగో హ‌ర్ట్ అయింది.
 
ఏంటి? నువ్వు చెబితే నేను వినేది? అంటూ క‌టువుగా చెప్పేస‌రికి అంత‌కంటే ఇగో హ‌ర్ట్ అయినా పోసాని బ‌య‌ట‌కు వ‌చ్చేసి  నీతో నేను చేయ‌న‌ని ఖ‌రాఖండిగా చెప్పేశాడు. అలా బ‌య‌ట‌కు వ‌చ్చిన పోసాని తానే హీరోగా, ద‌ర్శ‌కుడిగా తీసిన సినిమానే `మెంట‌ల్ కృష్ణ‌`. ఆ చిత్రంలో హీరో పాత్ర ర‌క‌ర‌కాలుగా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. ఫైన‌ల్‌గా ఈ సినిమా విడుద‌లై ఊహించ‌ని విజ‌యాన్ని సాధించింది. ఈ విజ‌యం క‌న్న‌డ‌నూ తాకింది. దాంతో ఇగోను ప‌క్క‌న బెట్టి మ‌ర‌లా మీతో సినిమా చేయాల‌నుంద‌ని ఉపేంద్ర వెల్ల‌డించారు. కానీ పోసాని ఇగో త‌గ్గ‌లేదు. ఒక‌సారి నా మైండ్ చిప్ దొబ్బింది. దాన్ని సెట్ చేయ‌డానికి నాకే సాధ్యం కాదు అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇటీవ‌లే జ‌రిగిన టీవీ ప్రోగ్రామ్‌లో పోసాని బ‌య‌ట పెట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెప్టెంబరు 7న రక్త చంద్రగ్రహణం.. ఏయే దేశాల్లో కనిపిస్తుంది...

Pulivendula: జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.. పులివెందులతో సీన్ మారుతోందిగా!

నా మరదలంటే నాకు పిచ్చి ప్రేమ, పెళ్లి చేయకపోతే టవర్ పైనుంచి దూకి చస్తా: బావ డిమాండ్, ఏమైంది? (video)

అమెరికా విర్రవీగుతోంది.. భారత్‌తో పెట్టుకోవడమంటే ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉంటుంది..

Lakh Bribe: లంచం తీసుకున్న ఎస్ఐకి ఏడేళ్ల జైలు శిక్ష.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments