Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ సమంత.. అక్కినేని ఇంటి కోడలు అనిపించుకున్నావ్..

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (13:53 IST)
అక్కినేని సమంత.. మామగారైన కింగ్ నాగార్జున పుట్టిన రోజున ఆసక్తికర కామెంట్స్ చేసింది. అక్కినేని కోడలయ్యాక సమంతకు అదృష్టం కూడా బాగా కలిసి వచ్చింది. తాజాగా కింగ్ నాగార్జున 60వ పుట్టినరోజు వేడుకలు స్పెయిన్‌లో ప్లాన్ చేశారు. దీని కోసం సమంత, చైతు వారం ముందే ఇబిజకు చేరుకొని అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. తన పుట్టినరోజు నాడు ఫ్యామిలీతో సహా ఇబిజకు చేరుకున్నారు నాగార్జున.
 
కుటుంబంతో పాటు అక్కడ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా నాగార్జున అక్కడ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ తన కండలు చూపిస్తున్న ఫోటో పై సమంత భలే కామెంట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. 'మీరు వయసునే ఓడించారు మామ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
 
ఇంకా ఈ ఫోటోతో పాటు సమంత, చైతు, నాగ్, అమల, అఖిల్ కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫోటో కూడా షేర్ చేస్తూ ''మీ ప్రేమకి ధన్యవాదాలు. ఎప్పటికి మీ ప్రేమ, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను'' అని నాగ్ మామ చెప్పమన్నారు అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా అక్కినేని ఫ్యాన్స్ సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

పాకిస్థాన్ వంకర బుద్ధి.. కవ్వింపు చర్యలు.. ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments